E-Paper
Advertisement

గ్లోబల్ సంస్థలకు తెలంగాణలో తిరుగులేని ఆఫర్లు.. ఐటీ శాఖ రోడ్‌మ్యాప్ ఇదే?

గ్లోబల్ సంస్థలకు తెలంగాణలో తిరుగులేని ఆఫర్లు.. ఐటీ శాఖ రోడ్‌మ్యాప్ ఇదే?
Advertisement

Youth Talent: స్వేచ్చ బ్యూరో: తెలంగాణకు ఉన్న అతిపెద్ద బలం యువతలోని నైపుణ్యం, ప్రతిభ, ప్రపంచ స్థాయి పోటీతత్వమేనని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈ ప్రతిభ కారణంగానే హైదరాబాద్‌ సాంకేతిక, ఆవిష్కరణ, ఆర్థిక సేవలు, గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లకు (జీసీసీ) దేశంలోనే ప్రముఖ గమ్యస్థానంగా ఎదుగుతోందని వెల్లడించారు.

ప్రతిభే మన ప్రధాన బలం..

జూబ్లీహిల్స్‌లో బుధవారం జరిగిన డిఇ షా షా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌ సామర్థ్యాన్ని తొలినాళ్లలోనే గుర్తించిన ప్రపంచస్థాయి ఆర్థిక, సాంకేతిక సంస్థల్లో డిఇ షా ఒకటని అన్నారు. హైదరాబాద్‌ గత మూడు దశాబ్దాల్లో ఎంతో మారిందని, సాంకేతికత, ఆవిష్కరణలు, ఆర్థిక సేవలు, గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్లకు దేశంలోనే ప్రముఖ కేంద్రంగా ఎదిగిందని, యువతలోని నైపుణ్యం, ప్రతిభే మన ప్రధాన బలం” అని పేర్కొన్నారు.ప్రపంచ సంస్థలు కేవలం తమ కార్యకలాపాలను నిర్వహించే ప్రదేశంగా కాకుండా.. కొత్త ఆవిష్కరణలు, అత్యున్నత విలువ కలిగిన కార్యకలాపాలు, భవిష్యత్‌ సాంకేతికతల అభివృద్ధికి తెలంగాణను కేంద్రంగా ఎంచుకునేలా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

ఆవిష్కరణలకు శ్రీకారం..

Advertisement

ప్రపంచ సంస్థలు ఇక్కడ విస్తరించాలని, ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని, అత్యున్నత నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలను సృష్టించాలని, ఇందుకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ప్రపంచస్థాయి సంస్థల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.ప్రపంచ సాంకేతిక, ఆర్థిక సేవల సంస్థలకు తెలంగాణను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Also read: ఇండస్ట్రీలో విషాదం.. ‘అగ్గిపెట్టె మచ్చ’ కిరణ్ మృతి!

Tags

Related News

తెలంగాణలో కాంగ్రెస్ భారీ ఆందోళనకు పిలుపు.. ‘చలో రాజ్‌భవన్’ ఎప్పుడంటే?

తెలంగాణలో రోడ్డు ప్రమాదాల కట్టడికి జీఓ.. డీజీపీ ఆనంద్ బిగ్ ప్లాన్!

పీఎం శ్రీ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

దుర్గామాత మండపాల నిర్వాహకులు షాకింగ్ న్యూస్.. రూల్స్ పాటించాల్సిందే?

దసరాకు ఊరెళ్లేవారికి తీపి కబురు.. 7 వేల ప్రత్యేక బస్సులు.. మహిళలకు ఉచితం యథాతథం!

తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు పై సీపీఐ(ఎం) ఉద్యమ బాట!

యజమాని లేకుండా నకిలీ GPA సృష్టించి కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు.. ఎక్కడంటే?

Big Stories

Advertisement
×