Fire Accident: నల్గొండలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రకాశం బజార్‌లోని మెడికల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగలు దట్టంగా అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. అక్కడ ఓవైపు ఆస్పత్రి, మరోవైపు బ్యాంకులు, షాపులు ఉన్నాయి. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
చుట్టుపక్కల స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నా ఫలితం లేకపోయింది. ఫైరింజిన్లు వచ్చినా.. వాటర్ లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైర్ డిపార్ట్ మెంట్‌పై స్థానికులు ఓ రేంజ్ లో విరుచుకపడుతున్నారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగనట్టు తెలుస్తోంది. అదృష్టం కొద్ది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రూ.కోటి వరకు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలతియాల్సి ఉంది.
ALSO READ: Allu Arvind Mother Health: బిగ్ బ్రేకింగ్… అల్లు అరవింద్ తల్లికి తీవ్ర అస్వస్థత!