E-Paper
Advertisement

తిరుపతి కార్పొరేషన్‌లో బీజేపీకి షాక్.. ఓడిపోయిన జిల్లా, నగర అధ్యక్షులు!

తిరుపతి కార్పొరేషన్‌లో బీజేపీకి షాక్.. ఓడిపోయిన జిల్లా, నగర అధ్యక్షులు!
Advertisement

Tirupati BJP: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లోని 66 డివిజన్లలో కూటమి ఒప్పందంలో భాగంగా బీజేపీకి 5 స్థానాలు కేటాయించారు. అయితే ఇందులో ఇద్దరు కీలక నేతలకు ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. 21వ డివిజన్‌లో పోటీ చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్.. ఇండిపెండెంట్ అభ్యర్థి దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక 26వ డివిజన్‌లో కమలం పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు వరప్రసాద్.. వైసీపీ అభ్యర్థి వెంకటేష్ చేతిలో ఓడిపోయారు. జిల్లా, నగర అధ్యక్షులే సొంత డివిజన్లలో ఓడిపోవడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పరువు నిలిపిన ముగ్గురు నేతలు

Advertisement

మరోవైపు 44వ డివిజన్‌లో కరుణాకర్ రెడ్డి, 52వ డివిజన్‌లో పృథ్వీ, 62వ డివిజన్‌లో పార్థు విజయం సాధించి పార్టీ పరువు నిలిపారు. అయితే పదవులు ఉన్నంత మాత్రాన ప్రజల్లో వ్యక్తిగత ఆదరణ ఉండదని ఈ ఫలితాలు ನಿరూపించాయి. 21వ డివిజన్ విజేత దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డికి స్థానిక రాజకీయ నేపథ్యం, బంధువర్గం ఉండటం కలిసివచ్చింది. అలాగే 26వ డివిజన్ వైసీపీ విజేత వెంకటేష్ గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం, స్థానికుల సహకారం ఆయన గెలుపుకు బలమైన పునాదిగా నిలిచాయి.

పార్టీ గుర్తు కాదు.. స్థానిక బలమే ముఖ్యం!

Advertisement

నాయకులు తమ తమ డివిజన్లలో ప్రజలతో మమేకం కాకపోవడం, స్థానిక సమస్యలపై పోరాడకపోవడమే ఈ పరాభవానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ పార్టీ గుర్తు కంటే స్థానిక అభ్యర్థుల బలమే కీలకంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉండి, ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో విస్తరించే మంచి అవకాశాలు ఉన్నప్పటికీ.. కమలం పార్టీ వాటిని స్థానిక స్థాయిలో ఓట్లుగా మలుచుకోవడంలో విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: పార్టీల మద్దతు ఉంటే సరిపోదు భయ్యా.. క్షేత్రస్థాయిలో ఏబీవీ ఎక్కడ విఫలమయ్యారంటే?

Tags

Related News

పార్టీల మద్దతు ఉంటే సరిపోదు భయ్యా.. క్షేత్రస్థాయిలో ఏబీవీ ఎక్కడ విఫలమయ్యారంటే?

బెజవాడ బాద్‌షా వంగవీటి రాధా.. రికార్డు మెజారిటీతో మేయర్ పీఠం కైవసం!

ఎన్నికల ఫలితాలపై విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్.. అధికార పార్టీలో భయం మొదలైంది

‘మేం ఏసీ రూముల్లో ఎంజాయ్ చేస్తాం.. మీరే బలైపోతున్నారు’! జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్!

వైసీపీలో వణుకు మొదలు.. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 కేసు, ఉదయం నుంచి ఈడీ సోదాలు

ఓట్లు మీరే వేసుకుంటే ఇక ప్రజలతో పనేంటి?.. కూటమిపై విరుచుకుపడ్డ షర్మిల!

అన్నీ తానై పార్టీని నడిపించిన లోకేష్.. లోకల్‌లో కూటమి సత్తా, తండ్రికి గిఫ్ట్ ఇచ్చినట్టే!

Big Stories

Advertisement
×