BigTV English

Mallannasagar: ఫామ్‌హౌజ్‌ను ముట్టడిస్తాం.. కేసీఆర్‌కు మల్లన్నసాగర్ నిర్వాసితులు స్ట్రాంగ్ వార్నింగ్

Mallannasagar: ఫామ్‌హౌజ్‌ను ముట్టడిస్తాం.. కేసీఆర్‌కు మల్లన్నసాగర్ నిర్వాసితులు స్ట్రాంగ్ వార్నింగ్

Mallannasagar: మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కి మల్లన్నసాగర్ నిర్వాసితులు బహిరంగ లేఖ రాశారు. రేపు అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలపై మాట్లాడాలని వారు డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయినా చేయాలని లేదా వేరే వాళ్లకు అయినా అవకాశం ఇవ్వాలని మండిపడ్డారు. కేసీఆర్ తమ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడకపోతే రేపు మధ్యాహ్నం ఫామ్ హౌస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫామ్ హౌస్ వద్దే టెంట్ వేసుకుని సమస్య పరిష్కారం అయ్యేవరకు వంటావార్పు నిరసన వ్యక్తం చేస్తామని లేఖలో పేర్కొన్నారు.


పరిష్కారం చూపాలి..

మాజీ సీఎం కేసీఆర్ సృష్టించిన సమస్యలను ఆయనే పరిష్కరించాలంటూ అందుకు అనుగుణంగా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని అభ్యర్తించాలంటూ లేఖలో పేర్కొన్నట్లు మల్లన్న నిర్వాసిత బాధితులు తెలిపారు. ఇంతకు ముందే పోయిన సంవత్సరం డిసెంబర్ 16న మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలపై పోస్టు ద్వారా బహిరంగ లేఖ రాసినా కూడా కేసీఆర్ ఇంత వరకు స్పందించలేదని.. అసెంబ్లీలో మాట్లాడలేదని బాధితులు గుర్తు చేశారు. ఇప్పుడైనా తమ సమస్యలపై స్పందించి.. వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.


గత నెల ఫిబ్రవరి 7న బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిర్వాసితుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కానీ శాసన సభలో మాత్రం ఎందుకు ప్రస్తావించలేదో వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు చేసిన మల్లన్నసాగర్ కుంభకోణాలు, అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అనే భయంతోనే శాసనసభలో ఈ టాపిక్ లేవనెత్తలేదని భూనిర్వాసిత గ్రామాల బాధితులు ఆరోపణలు వ్యక్తం చేశారు.

భరోసా ఇవ్వలేరా..?

అలాగే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన రంగనాయక సాగర్, అంతగిరి ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలపై ఎందుకు లేఖ రాయలేదని బాధిత వ్యక్తులు నిలదీశారు. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నేతలు దోచుకున్న డబ్బును కాపాడుకోవడానికి  చేసిన అవినీతిని, తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే లేఖ రాశారని మల్లన్న సాగర్ నిర్వాసితులు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు కానీ, మాజీ మంత్రి హరీష్ రావు, ఆయన టీం సభ్యులు తాము నివసిస్తున్న ప్రాంతానికి రాలేదని అన్నారు. ఎక్కడో ఉండి సీఎం కు లేఖలు రాసే బదులు తమ దగ్గరకు వచ్చి సమస్యలపై పరిష్కారం చూపుతానని భరోసా ఇవ్వలేరా..? అని ప్రశ్నించారు.

కనీస సౌకర్యాలు లేవు..

మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి నిర్వాసిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని, బీఆర్ఎస్ నేతలు వారి పాపాలను కడుక్కోవాలని లేఖలో పేర్కొన్నారు. ముంపు గ్రామాల్లో ఎవరైనా చనిపోతే కనీసం అంతిమ సంస్కారాలు జరుపుకోవడానికి స్మశాన వాటికలు నిర్మించిలేదని.. దీంతో ముస్లిం, క్రిస్టియన్‌ లు, హైందవ సోదరులు నానా ఇబ్బందులు పడుతున్నారని లేఖలో తెలిపారు.

ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తాం..

చనిపోయిన వారి ఆత్మలు ప్రశాంతత దొరికే లోపే, వారి ఆత్మలు క్షోభించే లోపు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కేసీఆర్ ను లేఖలో పేర్కొన్నారు. ఇక ఇప్పుడు కూడా కేసీఆర్ స్పందించకపోతే.. అసెంబ్లీలో నిర్వాసితుల సమస్యలపై ప్రస్తావించకుంటే.. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులతో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్ ని ముట్టడిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో మల్లన్న సాగర్ బాధిత గ్రామాలైన బ్రాహ్మణ బంజేరుపల్లి, రాంపూర్, లక్ష్మాపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్, ఎర్రవల్లి, సింగారం గ్రామాల యువకులు ఉన్నారు.

ALSO READ: SBI Recruitment: రూ.1,00,000 జీతంతో SBIలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..

ALSO READ: Exim Bank: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,05,280.. దరఖాస్తు పూర్తి వివరాలివే..

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×