Heinrich Klassen: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ తరుణంలో… అన్ని జట్లు తమ…. ప్రాక్టీస్ సెషన్ మొదలుపెట్టాయి. విదేశీ క్రికెటర్లు కూడా తమ సొంత ఫ్రాంచైజీకి వచ్చి… జట్టులో చేరిపోయారు. అలాగే ప్రతి ఒక్క జట్టు రెండుగా విడిపోయి… ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా ఆడుతున్నాయి. మార్చి 22వ తేదీ నుంచి… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ప్రారంభం కానుంది. అంటే కేవలం నాలుగు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో విదేశీ క్రికెటర్లు కూడా చకచకా ఇండియాకు వచ్చేస్తున్నారు.
Also Read: Most Sixes IPL: ఎక్కువ సిక్సులు కొట్టిన వీరులు…గేల్ ను టచ్ కూడా చేయలేరు ?
ఈ తరుణంలోనే…. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ( Sunrisers Hyderabad team ) దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) చేరిపోయాడు. ఈ నేపథ్యంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం…హెన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen ) కు అదిరిపోయే వెల్కమ్ చెప్పింది. అంతేకాదు బాహుబలి స్టైల్ లో… జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు హెన్రిచ్ క్లాసెన్. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. ఇందులో… వైట్ టీ షర్ట్ అలాగే పాయింట్ వేసుకొని.. బాహుబలి స్టైల్ లో బ్యాట్ పట్టుకొని కనిపించాడు హెన్రిచ్ క్లాసెన్. అలాగే ఆరెంజ్ క్యాప్ కూడా పెట్టుకున్నాడు హెన్రిచ్ క్లాసెన్.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడిన హెన్రిచ్ క్లాసెన్… అద్భుతంగా తన ఆట తీరును కనబరిచాడు. అందుకే మొన్నటి మెగా వేలంలో హెన్రిచ్ క్లాసెన్ ని వదిలి పెట్టుకోకుండా రిటైన్ చేసుకున్నారు హైదరాబాద్ ఓనర్ కావ్య పాప (Kavya Maron) . ఏకంగా 23 కోట్లు పెట్టి అతన్ని వెనక్కి తీసుకుంది కావ్య పాప. గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడి మరి జట్టును గెలిపించాడు. గత సీజన్లో ఫైనల్ వరకు హైదరాబాద్ జట్టు వచ్చిందంటే దానికి ముఖ్య కారణం హెన్రిచ్ క్లాసెన్ అని చెప్పవచ్చు.
Also Read: Rohit Sharma: మాల్దీవుల్లో రోహిత్ సైక్లింగ్.. వీడియో వైరల్
ఈ తరుణంలోనే హెన్రిచ్ క్లాసెన్ ని కొనుగోలు చేసింది కావ్య పాప. ఇక తాజాగా జట్టులో అతను చేరడంతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇది ఇలా ఉండగా ఐపిఎల్ 2025 టోర్నమెంట్… మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మే 25వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. మార్చి 23వ తేదీ న సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాదులోనే ఉప్పల్ స్టేడియంలో ( Hyderabad Uppal Stadium)నిర్వహించబోతున్నారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఎప్పటి లాగే జియో హాట్స్టార్ లో… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు రాబోతున్నాయి.
𝐁𝐚𝐚𝐡𝐮𝐛𝐚𝐥𝐢 of #OrangeArmy has arrived 🫶💥
Heinrich Klaasen | #PlayWithFire pic.twitter.com/oZpXlkPIPq
— SunRisers Hyderabad (@SunRisers) March 18, 2025