Most Sixes IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఐపీఎల్ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఐపీఎల్ లోని పది జట్లు.. మ్యాచ్ లు ఆడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అన్ని జట్ల ప్లేయర్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో గతంలో నమోదు అయిన రికార్డులు ఇప్పుడు వైరల్ గా మారాయి.అత్యధిక సిక్సర్లు, బౌండరీలు, అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ల లిస్టు వైరల్ గా మారింది. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అంటేనే సిక్సర్లు అందరికీ గుర్తుకు వస్తాయి. అయితే… ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు ఎవరు అనే లిస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: Tim Seifert – Shaheen Afridi: అఫ్రిది ఇజ్జత్ తీసిన న్యూజిలాండ్ ప్లేయర్?
ఈ లిస్టు ప్రకారం… ఈ లిస్టులో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతను ఐపిఎల్ ఆడకపోయినప్పటికీ.. రికార్డు మాత్రం పదిలంగానే ఉంది. ఇప్పటివరకు క్రిస్ గేల్ 141 మ్యాచులు ఆడగా… ఇందులో 357 సిక్సర్లు కొట్టాడు. ఇక క్రిస్ గేల్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పటివరకు 252 ఇన్నింగ్స్ లు ఆడిన రోహిత్ శర్మ…. 280 సిక్సులు కొట్టాడు. దీంతో… సిక్స్ ల లిస్టులో రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత విరాట్ కోహ్లీ మూడవ స్థానాన్ని దక్కించుకున్నాడు. 244 ఇన్నింగ్స్ లలో ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 272 సిక్సులు కొట్టాడు. ఇక విరాట్ కోహ్లీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నిలిచాడు. ఇప్పటివరకు 229 ఇన్నింగ్స్ లాడిన మహేంద్ర సింగ్ ధోని 252 సిక్సులు బాదాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత… దక్షిణాఫ్రికా ఆటగాడు ఎబి డివిలియర్స్ ఉన్నాడు.
Also Read: Rohit Sharma: మాల్దీవుల్లో రోహిత్ సైక్లింగ్.. వీడియో వైరల్
ఇప్పటి వరకు 170 ఇన్నింగ్స్ ఆడిన ఎబి డివిలియర్స్ 251 సిక్సులు కొట్టాడు. ఇక దక్షిణాఫ్రికా ఆటగాడు ఎబి డివిలియర్స్… తర్వాత… ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. ఇప్పటివరకు.. 184 మ్యాచ్ లాడిన డేవిడ్ వార్నర్ 236 సిక్సులు కొట్టాడు. ఈ టాప్ ప్లేయర్లలో ముగ్గురు కూడా ఇప్పుడు ఐపీఎల్ ఆడటం లేదు. క్రిస్ గేల్ అలాగే ఎబి డివిలియర్స్ ఇద్దరు కూడా ఐపీఎల్ కు దూరంగా ఉంటున్నారు. కానీ డేవిడ్ వార్నర్ ను మొన్న వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. కాబట్టి ఈ ముగ్గురిని పక్కకు పెడితే మిగిలిన… టీమిండియా ప్లేయర్లు క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టే అవకాశాలు ఉంటాయి. ఇందులో ఎక్కువగా రోహిత్ శర్మకు ఈ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరో నాలుగు సీజన్ల వరకు విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఐపీఎల్ ఆడే ఛాన్స్ ఉంటుంది. రెండవ స్థానంలో ఉన్న… రోహిత్ శర్మ సులభంగా క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొడతాడు.