BigTV English

Mallareddy : ఐటీ విచారణకు హాజరుకాని మల్లారెడ్డి… వెళ్లింది వీరే?

Mallareddy : ఐటీ విచారణకు హాజరుకాని మల్లారెడ్డి… వెళ్లింది వీరే?

Mallareddy : ఐటీ విచారణకు మంత్రి మల్లారెడ్డి హాజరుకాలేదు. కానీ ఆయన కుటుంబ సభ్యులు, మల్లారెడ్డి సంస్థల్లో పనిచేస్తున్న వారు మొత్తం 10 విచారణకు హాజరయ్యారు. వారిని ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.


మరోవైపు ఐటీ అధికారులకు సహకరిస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఉప్పల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తనను ఐటీ వాళ్లు వదిలిన మీడియా వాళ్లు మాత్రం వదలడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఐటీ విచారణపై తానిప్పుడే ఏం మాట్లాడలేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున తాను ఐటీ విచారణకు హాజరుకాలేదన్నారు. తన తరఫున ఆడిటర్ ను పంపానని తెలిపారు.

ఐటీ విచారణకు సహకరిస్తానని మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితమే తనకు సమన్లు అందాయని తెలిపారు. ఐటీ అధికారులకు అన్ని విధాల సహకరిస్తానని వెల్లడించారు.


మల్లారెడ్డి తో సహా 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులతోపాటు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. వారందరినీ సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు. ఐటీ సోదాల్లో లభ్యమైన కీలక డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్స్ కు సంబంధించిన వివరాలు తీసుకురావాలని కోరారు. దీంతో నోటీసులు అందుకున్న వారిలో 10 ఐటీ విచారణకు హాజరయ్యారు.

ఐటీ విచారణకు హాజరైన వ్యక్తులు

1.మర్రి రాజశేఖర్ రెడ్డి , మల్లారెడ్డి అల్లుడు

  1. మర్రి లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తండ్రి
  2. భద్రారెడ్డి, మల్లారెడ్డి చిన్న కొడుకు
  3. నరసింహారెడ్డి, MLR కాలేజ్ ఛైర్మన్
  4. త్రిశూల్ రెడ్డి, నరసింహారెడ్డి కొడుకు
  5. రామస్వామిరెడ్డి, మెడికల్ కాలేజ్ డైరెక్టర్
  6. మెడికల్ కాలేజ్ అకౌంటెంట్
  7. శివకుమార్ రెడ్డి, మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్
  8. మాధవి , మల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్
  9. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×