E-Paper
Advertisement

Mallu Ravi : తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి.. కేంద్రాన్ని కోరిన మల్లు రవి..

Mallu Ravi : తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి.. కేంద్రాన్ని కోరిన మల్లు రవి..
Advertisement

Mallu Ravi : ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు చేపట్టారు. డప్పు వాయిద్యాలతో తెలంగాణ భవన్‌లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ పనులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.

టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న మల్లు రవి తొలు నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. స్టూడెంట్ లీడర్ గా మొదలుపెట్టి ఎంపీ స్థాయికి ఎదిగారు. 1991-96, 98-99 మధ్య నాగర్ కర్నూల్ ఎంపీగా ఉన్నారు.

Advertisement

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కృషి చేశారు. ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా పార్టీ కోసం పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఇటీవల మల్లు రవిని సీఎం రేవంత్‌రెడ్డి నియమించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు.

ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన ఏఐసీసీ పెద్దలకు మల్లు రవి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి చెందిన అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 15
అంశాలపై ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారని వివరించారు.సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని మల్లు రవి కోరారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×