Machilipatnam Assembly Constituency : మచిలీపట్నం నియోజకవర్గం హాట్ పాలిటిక్స్ కు పెట్టింది పేరు. ఇక్కడ కాపు సామాజికవర్గం ఓట్లు బలంగా ఉన్నాయి. వీరు ఎటువైపు డిసైడ్ అయితే వారిదే విజయం. మరోవైపు బందరు పోర్టు ఇక్కడి రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తోంది. దీంతో ఉపాధి కల్పన అవకాశాలు పెరుగుతాయన్న అభిప్రాయం జనంలో ఉంది. అయితే గత ఎన్నికల్లో గెలిచిన పేర్ని నాని ఈ సారి తన కొడుకు పేర్ని కృష్ణమూర్తిని రంగంలోకి దించుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఆయన విక్టరీ సాధిస్తే మాత్రం ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన వారవుతారు. మూడు తరాల వారు ఎమ్మెల్యేలుగా పనిచేసిన గుర్తింపు పేర్ని కుటుంబానికి దక్కనుంది. బందర్ గడ్డపై ఇప్పటికే మూడు సార్లు తన జెండా పాతారు పేర్ని నాని. ఈ నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీ 35 శాతం దాకా ఉంటుంది. ఈసారి వీరి సపోర్ట్ టీడీపీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేసే అభ్యర్థివైపు ఉంటుందని అంటున్నారు. అయితే వైసీపీ నుంచి పోటీలో ఉన్నది కూడా కాపు నేతే కావడంతో ఓట్లు రెండువైపులా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చీలే ఓట్లలో పెద్ద షేర్ మాత్రం టీడీపీ-జననసేకే వెళ్తుందన్న అంచనాలున్నాయి. మరి మచిలీపట్నం నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.
2019 RESULTS
పేర్ని నాని (గెలుపు) VS కొల్లు రవీంద్ర
YCP 44%
TDP 40%
JSP 13
OTHERS 3%
2019 ఎన్నికల్లో మచిలీపట్నంలో వైసీపీ గెలిచింది. అక్కడ పోటీ చేసిన పేర్ని నాని 44 శాతం ఓట్లు సాధించారు. అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన కొల్లు రవీంద్ర 40 శాతం ఓట్లు రాబట్టారు. అలాగే జనసేన కూడా పోటీలో ఉండడం బండి రామకృష్ణ పోటీ చేయడంతో ఆయనకు 13 శాతం ఓట్లు పడ్డాయి. ఈ వేసిన ఓట్లలో చాలా మంది కాపు సామాజికవర్గం వారే ఉన్నారని తేలింది. గత ప్రభుత్వంలో కొల్లు రవీంద్ర మంత్రిగా పని చేసినా మచిలీపట్నం సెగ్మెంట్ అంతగా అభివృద్ధి చేయలేకపోయారన్న పాయింట్ పై ఓడిపోయారన్న లెక్కలు తెరపైకి వచ్చాయి. మరి ఈసారి ఎన్నికల్లో మచిలీపట్నం సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
పేర్ని కృష్ణమూర్తి (YCP)
పేర్ని కృష్ణమూర్తి ప్లస్ పాయింట్స్
పేర్ని కృష్ణమూర్తి మైనస్ పాయింట్స్
కొల్లు రవీంద్ర (TDP)
కొల్లు రవీంద్ర ప్లస్ పాయింట్స్
ఇక వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..
పేర్ని కృష్ణమూర్తి VS కొల్లు రవీంద్ర
YCP 43%
TDP 52%
OTHERS 5%
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రకు 52 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని సర్వేలో తేలింది. అలాగే వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి 43 శాతం ఓట్లు లభించే అవకాశాలున్నాయి. ఇతరులు 5 శాతం ఓట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ ఓట్ షేర్ పెరగడానికి కారణం కాపు ఓట్లు అని తేలింది. టీడీపీ-జనసేన వైపు వీరంతా షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉండడంతో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్లస్ అవుతుందని తెలుస్తోంది. అలాగే అమరావతి రాజధాని తరలింపు కూడా ఓటర్లపై ప్రభావం చూపింది. కొల్లు రవీంద్ర వ్యక్తిగత ఇమేజ్ కూడా ఆ పార్టీ గెలిచేందుకు కారణమవుతుందన్న అంచనాలున్నాయి. అటు పేర్ని నాని ఎఫెక్ట్, వైసీపీ క్యాడర్ సపోర్ట్, వెల్ఫేర్ స్కీంలపై జనం ఫోకస్ తో వైసీపీకి ఓట్ షేర్ 43 శాతం దాకా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఇంకోవైపు మచిలీపట్నం సిట్టింగ్ వైసీపీ ఎంపీ బాలశౌరి పార్టీకి రాజీనామా చేయడం పేర్ని నాని వెంట తిరిగిన వారు ఆయన కొడుకుకు సపోర్ట్ ఇస్తారా అన్న డౌట్లు ఉండడంతో మచిలీపట్నంలో వైసీపీ ఓట్ షేర్ ను తగ్గిస్తోందన్న అంచనాలున్నాయి.