Balnagar Road Accident: ట్రాఫిక్ కానిస్టేబుల్ నిర్వాకం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసింది. బాలానగర్ IDA దగ్గర డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ చింతల్ నుంచి బాలానగర్ వెళ్తున్న ఓ వాహన దారుడుని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. బైక్ ని పక్కకు పెడుతుండగా.. అటుగా వస్తున్న RTC బస్సు ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో అక్కడ జనం గుమీగూడడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
అటు ట్రాఫిక్ పోలీస్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్రవాహనదారుడి నుంచి బండి తాళాలు లాక్కునేందుకు ప్రయత్నించడంతోనే వాహనదారుడు కిందపడ్డాడని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఈ మేరకు వాహనదారులతో పాటు మృతుడి బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. మృతి చెందిన వ్యక్తిని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ బాలానగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ట్రాఫిక్ కానిస్టేబుల్ నిర్లక్ష్యానికి వాహనదారుడు మృతి చెందాడు. చలానా కోసం రన్నింగ్ వాహనాన్ని కానిస్టేబుల్ ఆపడంతో పాటు.. చొక్కా పట్టుకొని లాగడం వల్లే బస్సు టైర్ల కింద పడి జోజిబాబు చనిపోయాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. స్పాట్‌లోనే జోజిబాబు మృతి చెందగా.. మృతుడికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు.
ఏపీలోని కోనసీమ నుంచి వచ్చిన జోజిబాబు కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. కానిస్టేబుల్‌ను పట్టుకున్న స్థానికులు.. అతనిపై దాడికి యత్నించారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు.
Also Read: సోషల్ మీడియాలో న్యూడ్ వీడియోలు.. ప్రాణాలు తీసుకున్న యువతి
కానిస్టేబుల్‌ను పట్టుకున్న స్థానికులు.. అతనిపై దాడికి యత్నించారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో నర్సాపూర్ రూట్‌లో జీడిమెట్ల నుంచి బాలానగర్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాగ్వాదానికి దిగిన వారిని పోలీసులు చెదరగొట్టారు.