Human relationships: ఇంట్లో తల్లిదండ్రులు చేసే పనులు, మాట్లాడుకునే మాటలు చిన్న పిల్లలపై ఎంతో ప్రభావం చూపుతాయి. అందుకే పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న పిల్లల ముందు పెద్దలు మాట్లాడుకునే విషయాలు, తల్లిదండ్రుల ప్రవర్తన ఎంతో ఇంపాక్ట్ చూపిస్తాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే సమాజం రోజురోజుకీ ఎటు పోతుందో అనిపిస్తుంది.
నాలుగో తరగతి పరీక్షల్లో ఓ చిన్నారి రాసిన ఆనర్స్ పేరెంట్స్‌ను ఆలోచింపచేసేలా ఉంది. తల్లిదండ్రులు చేసే పనులు పిల్లలపై ఏరకమైన ప్రభావం చూపుతున్నాయనే దానికి ఇది మరో నిదర్శనం. క్వశ్చన్ పేపర్లో అమ్మకు నచ్చనిది ఏమిటని అడగ్గా.. చిన్నారి తాతయ్య, నానామ్మ అని ఆన్సర్ రాశాడు. పెద్దలు చేసే పనుల వల్ల తెలిసీతెలియని వయసులో చిన్న పిల్లల మీద చాలా ప్రభావం పడుతుంది. ఇంట్లో ఉన్న వృద్ధులను సరిగా చూసుకోకుండా, వారిని అసహ్యించుకుంటే పిల్లల మనస్తత్వం కూడా అలాగే మారే అవకాశం ఉంటుంది.
ALSO READ: వృద్ధురాలిని అనాథను చేసిన కుంటుంబ సభ్యులు
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలుడు ఈ ఆన్సర్ రాసినట్టు తెలుస్తోంది. ఎవరు అనేది కచ్చితంగా తెలీడం లేదు. పేపర్ కరెక్షన్ చేసిన టీచర్ కూడా.. స్కూల్ పేరు, స్టూడెంట్ పేరు తెలీకుండా జాగ్రత్త పడ్డారు. నాలుగో తరగతి ఇంగ్లీష్ పరీక్షలో చిన్నారి రాసిన ఆనర్స్ పేరెంట్స్‌ను ఆలోచింపచేసేలా ఉంది. క్వశ్చన్ పేపర్లో అమ్మకు నచ్చనిది ఏమిటని అడగ్గా.. చిన్నారి తాతయ్య, నానమ్మ అని ఆన్సర్ రాశాడు.
సమాజంలో దిగజారిపోతున్న మానవ సంబంధాలకు ఈ సమాధానం అద్దం పడుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. దీని సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి ప్రస్తుత రోజుల్లో బంధాలు, బంధుత్వాలు తెగిపోతున్నాయని కొందరు అంటున్నారు. ఒకప్పుడు తాత, నానామ్మ కోసం సెలవులకు పరిగెత్తుకొని వెళ్లే వారని.. భవిష్యత్‌లో ఓల్డేజ్ హోమ్స్‌కు వెళ్లాల్సి వస్తుందేమో అనే ఆవేదన వ్యక్తమవుతోంది.