BigTV English

Mansukh Mandaviya: ఒక్కొక్కరికి అకౌంట్లలో రూ.15వేలు జమ.. కేంద్ర మంత్రి వెల్లడి

Mansukh Mandaviya: ఒక్కొక్కరికి అకౌంట్లలో రూ.15వేలు జమ.. కేంద్ర మంత్రి వెల్లడి

Union Minister reviews performance of Telangana Zone of EPFO, ESIC: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి ఈఎల్ఐ కింద ఈపీఎఫ్ అకౌంట్లలో నెల జీతం కింద గరిష్టంగా రూ. 15వేల వరకు జమ చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.


ఇక, దేశ వ్యాప్తంగా అధిక మిగులు నిధులు ఉన్న జోన్‌గా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో ప్రధానంగా ప్రతి ఏడాది చందా మొత్తం పెరుగుతూ వస్తుండడం గమనార్హం. ఈ ఏడాది సుమారు 669 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందగా.. వీరందరికీ అదే రోజున పింఛన్‌కు సంబంధించిన పీపీఓ జారీ అయింది.

అయితే, ఈఎల్ఐ పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే ఈపీఎఫ్ఓ హైదరాబాద్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఈఎల్ఐ నిధుల అమలు కోసం ఓ ఐటీ వ్యవస్థను తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.


ఇక, తెలంగాణలో 36,018 సంస్థల కింద దాదాపు 47.96 లక్షలమంది చందాదారులు, 4.54 లక్షలమంది పెన్షన్ తీసుకునేవారు ఉన్నట్లు కేంద్ర మంత్రి వివరించారు. కాగా, హైదరాబాద్‌లోని బర్కత్ పుర పీఎఫ్ కార్యాలయాన్ఈని సందర్శించిన ఆయన ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా రూ.15వేలు జమ కానున్నట్లు తెలిపారు. తెలంగాణ జోన్ పనితీరు చాలా బాగుందని కితాబిచ్చారు.

ఈ సందర్భంగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ, డిప్యూటీ చీఫ్ లేబర్‌ల తెలంగాణ జోన్ పనితీరుపై కేంద్ర మంద్రి మన్‌సుఖ్ మాండవ్య సమీక్ష నిర్వహించారు. ఈపీఎఫ్ తెలంగాణ జోన్‌ల ప్రతి ఏడాది రూ.7,797కోట్ల చెల్లింపులు జరుగుతున్నట్లు వెల్లడించారు.

అందుకే కొత్తగా చేరుతున్న ఉద్యోగుల కోసం కేంద్రం ఈ ఏడాది బడ్జెట్‌లో ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్(ఈఎల్ఐ) స్కీమ్‌ను ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ స్కీమ్ కింద తొలిసారి ఉద్యోగంలో చేరుతున్న యువతీయువకులకు ఒక నెల జీతం ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తుందని తెలిపారు.

Also Read: హైదరాబాద్‌లో భారీగా వర్షం… అటువైపు వెళ్తే మీ పని అయిపోయినట్టే!

ఈ జోన్ పరిధిలో రూ.19,939కోట్ల చందా వసూళ్లు ఉండగా.. రూ.7,797 కోట్లు చెల్లింపులు ఉన్నాయి. ప్రతి ఏటా చందా వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. అంతకుముందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 16.58శాతం పెరుగుదల నమోదు కాగా, పరిపాలన ఖాతాలో 14.90శాతం పెరిగడం ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితిని సూచిస్తుందని వెల్లడించారు.

ఇక, ఈ ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సర విషయానికొస్తే..కేవలం 10 రోజుల్లో సెటిల్ అయిన క్లెయిమ్‌లు 70.39 శాతం ఉండగా.. 20 రోజుల్లో 92.89శాతం ఉన్నాయని వెల్లడించారు.

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×