E-Paper
Advertisement

Medchal News: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహం.. భర్త ఇంటిముందు భార్య ధర్నా!

Medchal News: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహం.. భర్త ఇంటిముందు భార్య ధర్నా!
Advertisement

Medchal News:  మేడ్చల్ స్వేచ్ఛ : మేడిపల్లి పోలీస్ స్టేషన్ (Medipally Police Station) పరిధిలోని ధరణి కాలనీలో కుటుంబ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. పద్మ అనే వివాహిత తన అత్తారింటి ముందు ధర్నా చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఘటన వివరాలు తన భర్త బండి పవన్, తాను భార్యగా ఉండగానే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని పద్మ ఆరోపించింది. పదేళ్ల క్రితం తనను వివాహం చేసుకున్న పవన్, పిల్లలు లేవనే నెపంతో మరో మహిళతో కలిసి ఉంటున్నాడని తెలిపింది. పెళ్లి సమయంలో 20 లక్షల రూపాయల నగదు, 10 తులాల బంగారం కట్నంగా ఇచ్చామని, ఆ తరువాత కూడా వేధింపులకు గురిచేస్తూ ఉండటంతో తమ తల్లిదండ్రులు ఒక ఎకరం భూమిని ఇద్దరి పేరుపై ఇచ్చారని పద్మ పేర్కొంది.

Also Read: Medchal Road Accident: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని యువకుడు మృతి!

భర్త ఇంటిముందు భార్య ధర్నా

Advertisement

నా భర్త నాకే కావాలి, నాకు న్యాయం చేయాలి అంటూ పద్మ తన బంధువులతో కలిసి అత్తారింటి ముందు నిరసన వ్యక్తం చేసింది. ఇంట్లో అత్త, మామ, మరిది, భర్తతో పాటు సహజీవనం చేస్తున్న మరో మహిళ కూడా ఉంటోందని ఆరోపించింది. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహజీవనం చేస్తున్న మహిళ ఇంట్లోనే ఉందని, ఆమెను బయటకు తీసుకురావాలని పద్మ డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించింది. పోలీసులు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు పోలీస్ వాహనానికి అడ్డంగా కూర్చుని నిరసన వ్యక్తం చేసింది.

Also Read: Bandi Sanjay: 100 కోట్ల ఒప్పందమా? ఆధారాలు చూపండి! బండి సంజయ్‌పై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు

Related News

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

వనపర్తి ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాభివృద్ధికి రాజా కృష్ణదేవరావు అభయం!

దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

Big Stories

Advertisement
×