Hyderabad Temple: హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది? హిందువులను టార్గెట్ చేస్తూ వికృత చర్యలకు పాల్పడుతున్నదెవరు? విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారా? వరుసగా జరుగుతున్న ఘటనలు దేనికి సంకేతం? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
హైదరాబాద్‌లోని ఓ శివుడు ఆలయంలో అపచారం లో చోటు చేసుకుంది. శివలింగం పక్కనే మాంసం ముద్దలు దర్శనమిచ్చాయి. ఈ ఘటన టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయంలో జరిగింది. బుధవారం ఉదయం దేవాలయానికి వచ్చిన భక్తులు ఆ సన్నివేశాన్ని చూసి షాకయ్యారు. కాసేపు నోటి వెంట భక్తులు మాట రాలేదు.
ఈ విషయం స్థానికుల చెవిలో పడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మాంసం చూసి చాలామంది భక్తులు కంగుతిన్నారు. పోలీసులకు అక్కడికి చేరుకునే సరికి హిందూ సంఘాలు సైతం అక్కడికి చేరుకున్నాయి. మాంసం పడేసింది ఎవరో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆలయం చుట్టు పక్కల ప్రాంతాలను పోలీసులతోపాటు భక్తులు, హిందూ సంఘాలు పరిశీలించాయి. కావాలనే ఎవరో ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్లాన్ చేసినట్టు భావిస్తున్నారు. సమీపంలో సీసీ టీవీ కెమెరాలను చెక్ చేస్తున్నారు పోలీసులు.
ALSO READ: హైదరాబాద్‌లో ఉన్నారా? మాస్కులు పెట్టుకోండి.. లేకపోతే ప్రాణాలు గాల్లోకే!
మరోవైపు ఈ విషయం తెలియగానే మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కొంతమంది దుండగులు మాంసం ముద్దలు వేసి అపవిత్రం చేశారని అన్నారు. దుండగులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవన్నారు. కమిషనర్ ఈ కేసును ప్రత్యేకంగా చూడాలన్నారు. పోలీసులపై తమకు విశ్వాసం ఉందని, సీసీ టీవీ పుటేజ్ పరిశీలించి ఘటను పాల్పడినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇది నాణెనికి ఒక వైపు మాత్రమే. ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయం పూజారి రంగరాజన్‌ను కొందరు వ్యక్తులు దాడి చేశారు. రామరాజ్యం స్థాపనకు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు రంగరాజన్ నిరాకరించారు. ఆయనతోపాటు కుమారుడ్ని సైతం కొట్టారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఓ వైపు హిందూ సంఘాలు ఆగ్రహంతో రగిలిపోయాయి.
సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా బాధిత పూజారితో ఫోన్‌లో మాట్లాడారు. ధైర్యం చెప్పారు కూడా. ఈ ఘటన జరిగి నాలుగైదు రోజుల్లో శివుడి విగ్రహం వద్ద మాంసం ముద్దలు కనిపించడం రామరాజ్యం గ్యాంగ్ ప్రమేయముందా? అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగరాజన్‌పై దాడి కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు మెయినాబాద్ పోలీసులు. వారి వద్ద నుండి రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇందులో తీగలాడిగే డొంక కదులుతుందా?
అంతకుముందు గతేడాది అక్టోబర్ దేవి నవరాత్రుల సమయంలో మరో ఘటన జరిగింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బతుకమ్మ పండుగ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఆ విగ్రహం నుంచి చేయి వేరు చేశారు గుర్తు తెలియని వ్యక్తి. దీనిపై కూడా అప్పట్లో పెద్ద రచ్చ అయ్యింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందో తెలుసుకునే లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. చివరకు ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదని, డిప్రెషన్ లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఆలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు!
హైదరాబాద్‌లోని టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం పడేసిన దుండగులు
మాంసం చూసి కంగుతిని పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు
ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు
భారీగా చేరుకుంటున్న హిందూ సంఘాలు
మాంసం… pic.twitter.com/kPxVklMgna
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2025