Sandalwood Face Pack: పురాతన కాలం నుండి అందం , చర్మ సౌందర్యం కోసం గంధపు పొడిని ఉపయోగిస్తున్నారు. ఇది చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా మొటిమలు, ముడతలు , టానింగ్ వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. చర్మాన్ని ప్రశాంతపరుస్తుంది. అంతే కాకుండా సహజమైన మెరుపును కూడా అందిస్తుంది. గంధపు పొడిలో అద్భుత గుణాలు ఉంటాయి. ఇవి చర్మంలోని మచ్చలను తొలగించి, రంగును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
మీరు స్కిన్ కేర్ కోసం నేచురల్ ప్రొడక్ట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే గంధపు పొడిని సరిగ్గా ఉపయోగించడం వల్ల మీ చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది. ఇది అన్ని చర్మ రకాల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా గంధంతో ఫేస్ ప్యాక్, స్క్రబ్ , కూలింగ్ ట్రీట్‌మెంట్‌గా ఉపయోగించవచ్చు. మీ స్కిన్ కేర్ రొటీన్ లో గంధపు పొడిని చేర్చుకోవడానికి 5 ఉత్తమ మార్గాలను గురించి ఇప్పుడు చూద్దాం.
గంధం , రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే మచ్చలు తొలగిపోతాయి. ఇందుకోసం ఒక చెంచా గంధపు పొడిని రెండు చెంచాల రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను ముఖంపై 15-20 నిమిషాలు అప్లై చేసి తర్వాత శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని చల్లబరుస్తుంది. మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
మెరిసే చర్మం కోసం గంధం, పసుపు ఫేస్ ప్యాక్:
ఒక టీస్పూన్ గంధపు పొడి, అర టీస్పూన్ పసుపు , ఒక టీస్పూన్ పాలు కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను ముఖంపై 15-20 నిమిషాలు అప్లై చేసి తర్వాత శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.
జిడ్డు చర్మానికి గంధం , ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్:
ఒక చెంచా గంధపు పొడి ఒక చెంచా ముల్తానీ మిట్టి , రెండు చెంచాల రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఈ పేస్ట్‌ను ముఖంపై 15-20 నిమిషాలు అప్లై చేసి తర్వాత శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మం నుండి అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది.
గంధం, తేనె ఫేస్ ప్యాక్ :
ఒక టీస్పూన్ గంధపు పొడి ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను ముఖంపై 15-20 నిమిషాలు అప్లై చేసి తర్వాత శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని తేమగా మార్చడంలో సహాయపడుతుంది. మొటిమలను తగ్గించడానికి కూడా ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడుతుంది.
Also Read: తెల్లజుట్టు నల్లగా మార్చడానికి.. వీటిని మించినది లేదు !
గంధపు నూనె చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది:
గంధపు నూనె చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి మచ్చలను పోగొట్టడానికి, ముడతలను తగ్గించడానికి సహాయపడుతుంది. మీరు గంధపు నూనెను చర్మానికి నేరుగా అప్లై చేయవచ్చు లేదా మీకు ఇష్టమైన మాయిశ్చరైజర్‌తో కలిపి కూడా ఉపయోగించవచ్చు.