Hyderabad Methane Emissions | హైదరాబాద్ వాసులకు బయట వాతావరణం ప్రమాదం పొంచిఉంది. బయటి మాస్కులు ధరించకుండా వెళితే మాత్రం మీరు పీల్చే గాలిలో హానికారఖ గ్యాస్ ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఆ గ్యాస్ మరేదో కాదు మీథేన్. ఈ గ్యాస్‌కు రంగు, వాసన ఉండవు. అందువల్ల పీల్చే గాలిలో మీథేన్ గ్యాస్ ఉన్న తెలియదు. భారతదేశంలోనే అత్యధిక మీథేన్ కలిగిన వాతావరణ నగరంగా హైదరాబాద్ టాప్ పొజిషన్ లో ఉంది. ఈ గ్యాస్ పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదముంది. శ్వాసకోశ సమస్యలున్నవారికైతే ఈ గ్యాస్ విషంతో సమానం.
నవంబర్ 2024లో అర్భన్ క్లైమేట్ అనే సైన్స్ జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఇండియాలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగుళూరు, అహ్మదాబాద్, జై పూర్ వంటి నగరాల కంటే హైదరాబాద్ వాతావరణంలో ఈ మీథేన్ గ్యాస్ స్థాయి అత్యధికంగా ఉంది. సాధారణంగా గాలిలో కార్బన్ డైయాక్సైడ్ వల్ల వాతావరణం వేడెక్కుతుంది. కానీ మీథేన్ గ్యాస్.. కార్బన్ డైయాలక్సైడ్ కంటే 25 రెట్లు ఎక్కువ వేడిని వాతావరణంలో నిలుపుదల చేస్తుంది. ఇది పర్యావరణానికి ఎంతో హాని కలిగించే విషయం.
హైదరాబాద్ నగరంలో మీథేన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణాలు.. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, వాటిని సరైనా విధానంగా నియత్రంచడంలో విఫలమవుతున్న ప్రభుత్వ యంత్రాగమని జైపూర్ లోని మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు చెబుతున్నారు. సెంటర్ ఫర్ సస్టేనెబుల్ అగ్రికల్చర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన డాక్టర్ జివి రామాంజనేయులు ప్రకారం.. హైదారాబాద్ లో చెత్త నిర్వహణ సరిగా లేకపోవడం, వరదపు నీరు ఎక్కువ సమయం నిలిచిపోవడం, నగరంలోని ప్రధాన చెరువులు, సరస్సులలో నీటి కాలుష్యం తీవ్రంగా పెరిగిపోవడం లాంటి కారణాలతోనే మీథేన్ గ్యాస్ హైదరాబాద్ లో ఎక్కువగా ఉంది.
Also Read: సొంతింటి కల నిజం చేసుకోవాలంటే ఈ టిప్స్ పాటించండి..
ముఖ్యంగా మూసీ నది కాలుష్యం, హుస్సేన్ సాగర్ నీటి కాలుష్యం, జవహర్ నగర్‌లో ఉన్న విశాల చెత్త డంప్ యార్డుల నుంచి మీథేన్ గ్యాస్ అధికంగా ఉత్పత్తి అవుతోంది. ఈ అధ్యయనం చేయడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందని కోపర్ నికస్ సెంటినెల్-5 ప్రీకర్సర్ శాటిలైట్ ని ఉపయోగించారు. ఈ అధ్యయం చేస్తున్న సమయంలో వాతావరణం త్వరగా వేడుక్కుతున్న నగరాలను గుర్తించారు. వీటిలో హైదరాబాద్ గణాకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. 2019లో హైదరాబాద్ లోని మీథేన్ గ్యాస్ స్థాయి ఒక బిలియన్‌కి 1880 పార్ట్స్ ఉండగా..అదే 2023 వరకు వచ్చేసరికి ఈ గణాంకాలు 1970 పార్ట్స్ గా ఉన్నాయి.
ప్రాంతాలవారీగా చూస్తే.. రాజేంద్రనగర్, ఫలక్ నుమా, మెహ్దీపట్నం, చార్మినార్, కార్వాన్, జుబ్లీ హిల్స్, ఖైరతాబాద్, యూసుఫ్ గూడ లాంటి జిహెచ్‌ఎంసీ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాల్లోనే మీథేన్ గ్యాస్ స్థాయి ఎక్కువగా రికార్డ్ అయింది. దీనికి తోడు హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 2023లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. నగర పరిసరాల్లో ఉన్న షాద్ నగర్ ప్రాంతంలో 2013 ఉన్నా మీథేన్ గణాంకాలు 2022కి దాదాపు రెండింతలు అయ్యాయి.
ఈ మీథేన్ గ్యాస్ ఉన్న గాలిని పీల్చడం వల్ల ఆస్తమా అటాక్ ఇతర ఊపరితిత్తుల సమస్యలు, గుండె సంబంధిత రోగాలు, నెలలు నిండకుండానే పిల్లలు జన్మించడం వంటి సమస్యలు పెరుగుతాయి. ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే కాలుష్య నివారణం. ఇందుకోసం చెత్త నిర్వహణ, ప్రజల్లో అవగాహన పెరగాలి.