Hyderabad Police: హైదరాబాద్ లోని ఓ ఆలయంలో మాంసం ముద్దలు బయట పడిన విషయం తెల్సిందే. ఏకంగా ఆలయం లోపల మాంసం ముద్దలు ఉండడంతో అపచారం జరిగిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఈ ఘటనకు కారకులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చివరకు అసలు ఆలయంలోకి మాంసం ముద్దలు ఎలా వచ్చాయో తేల్చేశారు.
హైదరాబాద్ నగరంలోని ఓ ఆలయంలోకి బుధవారం వెళ్లిన అర్చకులకు ఆలయం లోపల మాంసం ముద్దలు కనిపించాయి. దీనితో ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతరం భక్తులు వచ్చే ఆలయం, మాంసం ముద్దలు ఉండడంతో అపవిత్రమైందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తెలుసుకున్న వెంటనే పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం స్పందించారు. వెంటనే ఘటనకు కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని, భక్తుల ద్వార వివరాలు ఆరా తీశారు. హైదరాబాద్ నగరంలో ఈ ఘటన సంచలనంగా మారింది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడ అలర్ట్ అయ్యారు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భాద్యులను శిక్షిస్తామని భక్తులకు పోలీసులు హామీ ఇచ్చారు. అయితే చివరకు పోలీసులు అసలు విషయాన్ని తేల్చి చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆలయంలో మాంసం ముద్దలు ఉన్నట్లు తెలుసుకున్న వెంటనే సిసి కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఉదయం నుండి 17 సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనకు ఓ పిల్లి కారణంగా పోలీసులు పేర్కొన్నారు. ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పిల్లి తన నోటితో మాంసం ముద్దను పట్టుకొని ఆలయంలోకి వెళ్లినట్లు పోలీసులు ధ్రువీకరించారు. పిల్లి అలా వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైనట్లు, పిల్లి వెళ్లే రీతిలో గేటు గ్రిల్స్ ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Also Read: తిరుమల శ్రీవారి భక్తులకు.. టీటీడీ హెచ్చరిక.. ఇకపై అలా చేయవద్దంటూ హితవు
ఈ ఘటనకు పిల్లిదే భాద్యతగా పేర్కొన్న పోలీసులు, ఎటువంటి వదంతులు నమ్మవద్దని భక్తులను కోరారు. ప్రస్తుతం ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టే అసలు విషయం తెలిసిందని, ఆలయాలలో, ప్రార్థన మందిరాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. మొత్తం మీద ఆలయంలో మాంసం ముద్ద ఉదంతానికి పోలీసులు 17 సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించి అసలు విషయాన్ని బయటకు చెప్పేశారు.
ఆలయంలో మాంసం ముద్ద.. పిల్లి ఎంత పని చేసింది..
కొలిక్కి వచ్చిన టప్పాచబుత్రా హనుమాన్ టెంపుల్ ఘటన
ఉదయం నుంచి 17 సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు
నోట్లో మాంసం పెట్టుకుని ఆలయంలోకి పిల్లి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు https://t.co/qbBueD1Ehf pic.twitter.com/SC9OmqBtJ1
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2025