Kiss Day 2025: వాలెంటైన్స్ వీక్‌లో వాలెంటైన్స్ డేకి ముందు జరుపుకునే రోజు కిస్ డే. ముద్దు అనేది ప్రేమ యొక్క మధురమైన వ్యక్తీకరణలలో ఒకటి. ప్రేమికులు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమికులు ఎప్పుడూ కలిసి ఉండాల్సిన అవసరం లేదు. చాలా మంది ప్రేమికులు పనుల కారణంగా ఒకరికొకరు దూరంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో కిస్ డే నాడు కొన్ని మెసేజ్ ల ద్వారా తమ ప్రేమికులకు ప్రేమను తెలియజేయవచ్చు.
1. నువ్వు ఎవరో మొదట నాకు తెలియదు కానీ..
నువ్వు పరిచయం అయ్యాక తెలిసింది. నా సంతోషం నువ్వే అని హ్యాపీ కిస్ డే !
2. నా శ్వాస ఆగిపోయినా నా ప్రేమ మారదు ఎందుకంటే
మరణం శరీరానికే కాని మనసుకు కాదు.. హ్యాపీ కిస్ డే !
3. ఎంత గొడవపడినా మరుసటి రోజు ఏమి జరగనట్లు నవ్వుతూ
మాట్లాడే ప్రేమ దొరికితే స్వర్గమే .. హ్యాపీ కిస్ డే !
ముద్దు వల్ల కలిగే ప్రయోజనాలు:
ముద్దు ఒత్తిడిని తగ్గిస్తుంది:
ముద్దు వల్ల ఆక్సిటోసిన్, డోపమైన్ , సెరోటోనిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. ఫలితంగా మానసిక స్థితిని మెరుగుపడుతుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది:
ముద్దు పెట్టుకున్నప్పుడు హృదయ స్పందన పెరుగుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
ముద్దు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది:
ఇద్దరు వ్యక్తులు ముద్దు పెట్టుకున్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఈ సమయంలో బ్యాక్టీరియా మార్పిడి జరుగుతుంది. దీని కారణంగా శరీరంలో కొత్త ప్రతిరోధకాలు ఏర్పడతాయి . రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇది వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
ముద్దు కేలరీలను బర్న్ చేస్తుంది:
ముద్దు నిమిషానికి దాదాపు 2-6 కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది జీవక్రియను పెంచడంలో ,బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లోని ఒక అధ్యయనం ప్రకారం ముద్దు పెట్టుకునే పద్ధతి ,వ్యవధిని బట్టి నిమిషంలో 2 నుండి 26 కేలరీలు బర్న్ చేయబడతాయి. ఎందుకంటే ముద్దు శరీరంలోని అనేక భాగాలలో పనితీరు ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
ముఖ కండరాలకు మంచిది:
ముద్దు పెట్టుకోవడం వల్ల మీ ముఖ కండరాలకు మంచిది. ఎందుకంటే ఇది 34 ముఖ కండరాలకు పైగా వ్యాయామం చేస్తుంది. మీ ముఖాన్ని టోన్ గా , యవ్వనంగా ఉంచుతుంది. ఇది ముడతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.