Tesla Cyber Truck: దుబాయిలో 24 క్యారెట్స్ బంగారు పూత పూసిన టెస్లా సైబర్ ట్రక్ ను ప్రవాస భారతీయుడు గెలుచుకున్నారు. దుబాయి గోల్డ్ సౌక్ ఎక్స్ టెన్షన్ లో జరిగిన లాటరీలో అనూహ్యంగా 38 ఏళ్ల ప్రవాస భారతీయుడు ముంగి సోమేశ్వర రావు టెస్లా సైబర్ ట్రక్ ను గెలుచారు.
నవంబర్ 14 నుంచి జనవరి 31 వరకు జరిగిన ‘షాప్ అండ్ విన్’ అనే క్యాంపెయిన్ లో ఆయనకు ఊహించని విజయం దక్కింది. మామూలుగా ప్రమోషన్ సమయంలో.. దుకాణదారులు పాల్గొనే స్టోర్‌లలో ఖర్చు చేసిన ప్రతి దిర్హామ్ 500కి లాటరీ ఎంట్రీని పొందారు. ఈ క్యాంపెయిన్ లో ప్రవాస భారతీయుడు ముంగి సోమేశ్వర్ రావుకు విజయం వరించింది.
ముంగి సోమేశ్వర్ రావు 2021 నుంచి యూఏఈలో నివసిస్తున్నారు. ఇతను దుబాయ్ కి చెందిన ఫిన్ టెక్ ప్రొఫెషనల్. లాటరీ లో అనూహ్యంగా 24 క్యారెట్స్ బంగారు పూత పూసిన టెస్లా సైబర్ ట్రక్ ను గెలిచారు. సోమశ్వర్ రావు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఈ విధంగా మాట్లాడారు. ‘నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. తరుచుగా అదృష్టం కొద్ది ఇలాంటి విజయాలు వరిస్తాయి. అయితే నేను గతంలో చేసిన మంచి పనులకు ఈ అదృష్టం దక్కిందని భావిస్తున్నాను. జీవితంలో మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ముఖ్యం. దుబాయ్ లో గోల్డ్ సౌక్ ఎక్స్ టెన్షన్ లో అదృష్టం నన్ను వరించింది. ఈ విజయం నాకు జీవితంలో నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది’ అని సోమేశ్వర్ రావు వ్యాఖ్యానించారు.
దీరాలో ఉన్న దుబాయి గోల్డ్ సౌక్ ఎక్స్ టెన్షన్ ట్రెడిషనల్ గా చాలా ప్రఖ్యాతిగాంచినది. ఇక్కడ గోల్డ్, నగల దుకాణాలు, బులియన్ డీలర్లు, గ్లోబల్ బ్రాండ్స్, వర్క్ షాపులు, డైనింగ్ ఆప్షన్ లు మొదలైనవి స్థానికులను, పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. దుబాయ్ నడి ఒడ్డున ఉన్న నగలు దుకాణాలు గోల్డ్ లవర్స్ ను ఎంత్రో ఆకర్షిస్తాయి. ఇకడ షాపింగ్ మంచి ఎక్స్ పీరియన్స్ గా మిగిలిపోతుంది.