BigTV English

Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

Medak Road Accident Sevem killed: మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలతోపాటు మరో ఇద్దరు బాలికలు ఉన్నారు. మృతులంతా పాముబండ తండాకు చెందిన వాారిగా గుర్తించారు.


రహదారిపై గుంతలు ఎక్కువగా ఉండడంతో వేగంగాా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పడంతోపాటు పక్కన ఉన్న ఓ కల్వర్టును ఢీకొట్టింది. దీంతో కారు గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు నీటిలో మునిగి మృతి చెందారు. డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా తూప్రాన్ దగ్గర ముత్యాలమ్మ గ్రామ దేవత ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

మెదక్ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


Also Read: ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపులు.. పోలీసుల అదుపులో మైనర్.. పోస్టుల వెనక రహస్యమిదే!

ఇదిలా ఉండగా, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగిందని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. మద్యం మత్తులో ప్రమాదం జరిగిందా లేదనే వివరాలు విచారణలో తెలుస్తాయని వెల్లడించారు.

Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే ఆయన పనైపోయినట్టే

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×