Big Stories

Pig Kidney to Human: మనిషికి పంది కిడ్నీ.. ఇదో మెడికల్ మైల్ స్టోన్ అన్న వైద్యులు!

- Advertisement -

Pig Kidney Transplanted to Human: దేశంలో వైద్య సదుపాయాలు సరిగ్గా లేనపుడు.. పేషంట్ల ప్రాణాలు చిటుక్కున గాల్లో కలిసిపోయేవి. ఆ తర్వాత అవయవమార్పిడి విధానం వచ్చాక.. దాతలు లేదా చనిపోయిన వ్యక్తుల నుంచీ సేకరించిన అవయవాలను అవసరమైన వారికి మార్చి.. వారి ప్రాణాలను కాపాడుకునే వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు.. జంతువుల అవయవ మార్పిడి ద్వారా మానవుల ప్రాణాలను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు వైద్యులు. ఇందులో భాగంగా.. అమెరికా వైద్యులు మరో అడుగు ముందుకేశారు.

- Advertisement -

బ్రతికి ఉన్న పందినుంచి సేకరించిన కిడ్నీని.. జన్యు సవరణ చేసి 62 ఏళ్ల పేషంట్ కు అమర్చారు. బ్రతికి ఉన్న పంది కిడ్నీని ఒక మనిషికి అమర్చడం ఇదే తొలిసారి అని.. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. జంతువుల అవయవాలను మనిషికి అమర్చి.. వారి ప్రాణాలను రక్షించాలన్న ఆశతో ఈ ప్రయోగాలు మొదలయ్యాయి. తొలుత బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్లపై ఈ ప్రయోగం చేశారు. మార్చి 16వ తేదీన స్లేమాన్ అనే పేషంట్ కు సుమారు 4 గంటల పాటు శ్రమించి ఈ శస్త్రచికిత్స చేశారు. ఆయనకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. 7 సంవత్సరాలుగా డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకున్నాక.. 2018లో ఇదే ఆస్పత్రిలో మొదటి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు.

ఐదేళ్ల తర్వాత.. అదీ ఫెయిల్ కావడంతో 2023 మే లో మళ్లీ డయాలసిస్ కు వెళ్లాడు. అతను కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. డి క్లాటింగ్, సర్జికల్ రివిజన్ల కోసం ప్రతి రెండు వారాలకొకసారి ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. ఇది అతని జీవితాన్నిచాలా ప్రభావితం చేసింది. చివరికి పంది కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది సక్సెస్ అయితే తనలాంటి ఎందరో బాధితులకు ఉపయోగపడుతుందని స్లేమాన్ పేర్కొన్నాడు.

Also Read : వావ్..! మైండ్ చిప్‌తో వీడియో గేమ్.. కంప్యూటర్‌నే కంట్రోల్ చేశాడు

మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌కు చెందిన ఈజెనెసిస్ ప్రత్యేక పంది కిడ్నీని అందించింది. ఆ కిడ్నీలో మనిషికి హాని కలిగించే జన్యువులను తొలగించి.. మానవ జన్యువులను అమర్చి సవరించారు. ప్రస్తుతం స్లేమాన్ యాంటి రిజెక్షన్ ను తీసుకుంటున్నాడని, తాజాగా మార్చిన కిడ్నీ ఎంతకాలం పనిచేస్తుందో స్పష్టంగా తెలియదని వైద్యులు తెలిపారు. అయితే ఇప్పటికైతే స్లేమాన్ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ఇది సక్సెస్ అయితే.. ఎంతోమంది మిలియన్ల కిడ్నీ రోగులకు లైఫ్ లైన్ ను అందిస్తుందని వైద్యులు అభిప్రాయపడ్డారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News