BigTV English

Hyderabad Metro Rail: మెట్రోలో సీటు కోసం ఫీట్లు.. ప్రయాణికులు ఏం చేస్తున్నారో తెలుసా ?

Hyderabad Metro Rail: మెట్రోలో సీటు కోసం ఫీట్లు.. ప్రయాణికులు ఏం చేస్తున్నారో తెలుసా ?

metro


Metro Overcrowding In Raidurg Rout(Hyderabad latest updates): హైదరాబాద్ మెట్రో రైల్లో రద్దీ సమయాలలో ప్రయాణికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దూర ప్రయాణాలు చేసేవాళ్లు సీటుకోసం ఫీట్లు చేస్తున్నారు. ఇది మిగతా ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారింది. కారిడార్- 3- నాగోల్ రాయదుర్గం మార్గంలో ఇప్పుడున్న మెట్రో కోచ్ రద్దీ వేళల్లో సరిపోవడం లేదు. ఉదయం అమీర్ పేట నుంచి రాయదుర్గం వెళ్లాలంటే రద్దీతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. సాయంత్రం వేళల్లో నాగోల్ వెళ్లాల్సిన ప్రయాణికులు దుర్గం చెరువు, హైటెక్ సిటీ స్టేషన్ లో రాయదుర్గం వెళ్లే మెట్రోలో ఎక్కి కూర్చుంటున్నారు.

దీంతో రాయదుర్గం వెళ్లే ప్రయాణికులకు విపరీతమైన రద్దీ ఉండటం వల్లన సీటు కూడా దొరకడం లేదు. దీనిపైన మెట్రో అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. బ్రహ్మరిష్ అనే ప్రయాణికుడు మెట్రో సిబ్బందికి మెయిల్ రాసానని, ఎన్నోసార్లు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు.
అధికారులు హెచ్చరిస్తున్నా ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కడానికి కారణం.. రాయదుర్గం మెట్రో స్టేషన్ లో రివర్సల్ ఉండటమే కారణం.


Read more: ఓయూకు భారీ విరాళమిచ్చిన పూర్వ విద్యార్థి..

సాధారణంగా చివరి స్టేషన్ లో మెట్రో ఆగిన తర్వాత ప్రయాణికులు దిగిపోయిన తర్వాత 200 మీటర్ల వరకు అలాగే ముందుకు వెళ్తుంది. అక్కడ ఉన్న రివర్సల్ లో ట్రాక్ మారి.. మరోవైపు ఉన్న ఫ్లాట్ పామ్ మీదకి మెట్రో వస్తుంది. రాయదుర్గంలో రివర్సల్ ట్రాక్ ఉంది. దీంతో ప్రయాణికులు మెట్రో ఎక్కడం, దిగడం ఒకే ఫ్లాట్ ఫామ్ మీద జరుగుతోంది. మెట్రో ఆగడం ఆలస్యం ప్రయాణికులు ఎక్కేస్తుంటారు. అందులో ప్రయాణికులు అందరూ దిగారా? లేదా? అని పరిశీలించడం మెట్రో సిబ్బందికి సవాల్ గా మారింది. రాయదుర్గం -నాగోల్ వెళ్లేందుకు రాయదుర్గమే తొలి స్టేషన్ అయినప్పటికీ.. అక్కడ మెట్రో ఎక్కినవారికి సీటు కూడా దొరకడం లేదని వాపోతున్నారు. ముందు స్టేషన్లలోనే మెట్రో ఎక్కి కూర్చుంటుండటంతో ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదు.

Tags

Related News

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Mallareddy: మల్లారెడ్డి యూటర్న్.. రాజకీయాల్లో నో రిటైర్మెంట్

Telangana rains: మళ్ళీ ముంచెత్తనున్న వర్షాలు.. ఆగస్టు 14 నుండి 17 వరకు జాగ్రత్త!

Big Stories

×