BigTV English

Microsoft Office: ఆఫీస్ నెలరోజుల అద్దె రూ.5.4 కోట్లు.. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ రికార్డ్ బ్రేక్

Microsoft Office: ఆఫీస్ నెలరోజుల అద్దె రూ.5.4 కోట్లు.. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ రికార్డ్ బ్రేక్

హైదరాబాద్ లో అద్దె భవనాలకు విపరీతమైన కాంపిటీషన్ పెరిగింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నెలకు కోట్ల రూపాయలు వెచ్చించి మరీ హైదరాబాద్ లో తమ ఆఫీస్ లు ఓపెన్ చేస్తున్నాయి. దిగ్గజ సంస్థలన్నీ హైదరాబాద్ లో తమ కార్యాలయాలు ఉండటాన్ని గొప్పగా భావిస్తుంటాయి. మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా అందుకు మినహాయింపు కాదు. గచ్చిబౌలిలో ఆఫీస్ కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ ఏకంగా నెలకు రూ.5.4 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు హైదరాబాద్ కి సంబంధించి ఇదే అతి పెద్ద డీల్. నెల రోజులకు ఆఫీస్ రెంట్ రూ.5.4 కోట్లా అని సామాన్యులు నోరెళ్లబెట్టొచ్చు కానీ, ప్రైమ్ ఏరియాలో అద్దెకు ఆఫీస్ స్థలం దొరకాలంటే ఆమాత్రం ఇన్వెస్ట్ చేయక తప్పదు. అందుకే మైక్రోసాఫ్ట్ ఈ భారీ డీల్ కి ఓకే చెప్పింది.


చదరపు అడుగు రూ.204

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఫీనిక్స్ సెంటారస్ లో 2.6 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని మైక్రోసాఫ్ట్ లీజుకి తీసుకుంది. ఇక్కడ రీసెర్ట్ అండ్ డెవలప్మెంట్ కోసం ఆఫీస్ ని ఏర్పాటు చేస్తోంది ఆ సంస్థ. చదరపు అడుగుకి నెలకు రూ.204 రూపాయలు ఖర్చవుతుంది. అద్దెతోపాటు మెయింటెనెన్స్, ఇతరత్రా ఖర్చులన్నీ ఇందులోనే కలిపి ఉంటాయి. ఫీనిక్స్ సెంటారస్ లోని 3, 4 అంతస్తుల్లోని ఈ స్థలాన్ని ఫీనిక్స్ టెక్ జోన్ నుంచి టేబుల్ స్పేస్ సంస్థ లీజుకి తీసుకుంది. దాన్ని మైక్రోసాఫ్ట్ కి సబ్ లీజ్ కింద ఇచ్చింది. ఐటీ కారిడార్ లో ప్రైమ్ ఏరియా కావడంతో ఇక్కడ అద్దెలు భారీగా ఉంటాయి. లీజ్ అగ్రిమెంట్ ఈ ఏడాది జులైతో మొదలవుతుంది. ఏడాదికి 4.8 శాతం రెంట్ పెరుగుతుంది. ఇక సెక్యూరిటీ డిపాజిట్ కిందరూ. 42.15 కోట్లు చెల్లించారు.


గతేడాది TCS భారీ డీల్..

గతంలో TCS సంస్థ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శేరిలింగంపల్లి మండల్లోని ఐటీ శివారు ప్రాంతంలో ఆఫీస్ స్పేస్ కోసం భారీగా ఖర్చు పెట్టింది. 10.18 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని నెలవారీ రూ.4.3 కోట్లకు లీజుకు తీసుకుంది. పారాడైమ్ రాజపుష్పలోని 18 అంతస్తుల్లో ఈ స్థలం ఉంది. ఈ లీజు 2024 అక్టోబర్ నుంచి మొదలు కాగా, లీజ్ డీడ్ రిజిస్ట్రేషన్ ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిందని తెలుస్తోంది. ఇక్కడ లీజు వ్యవధి 15 సంవత్సరాలు కాగా, అద్దె ప్రతి సంవత్సరం 12శాతం పెరుగుతుంది.

ఫేస్ బుక్ కూడా..

ఇక ఫేస్ బుక్ సంస్థ కూడా హైదరాబాద్‌లో 3.7 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని తీసుకుంది. అయితే దీనికోసం రెండు వేర్వేరు లావాదేవీలు జరిగాయి. నెలవారీ అద్దె రూ.2.8 కోట్లు చెల్లించేలా ఒప్పందాలు కుదిరాయి. హైటెక్ సిటీలో ది స్కై వ్యూలో ఫేస్ బుక్ ఆఫీస్ ఉంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల రాకతోనే హైదరాబాద్ లో అద్దెలు భారీగా పెరిగాయి. ప్రైమ్ ఏరియాలో తమ ఆఫీస్ ఉండటం ఏ సంస్థకయినా గర్వకారణంగా ఉంటుంది. అందులోనూ ఉద్యోగులకు అందుబాటులో ఆఫీస్ లను ఏర్పాటు చేసుకుంటారు. వీటికోసం ఎంత ఖర్చయినా పెట్టడానికి ఆయా సంస్థలు సిద్ధంగా ఉంటాయి. ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్ సంస్థ అద్దె ఒప్పందాల్లో రికార్డ్ బ్రేక్ చేసిందనే చెప్పాలి.

Related News

Gachibowli News: హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల నుంచి 25 ప్లాట్లను అద్దెకు తీసుకుని.. చివరకు?

KTR: కేంద్రంలో 2 కోట్లు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఏమైనయ్.. అన్ని వట్టి మాటలేనా..? కేటీఆర్ ఫైర్

Khairatabad Ganesh: విశ్వశాంతి మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణపతి.. ఈసారి ఎన్ని అడుగులంటే..

Wife beats husband: భర్తను చితక్కొట్టిన భార్య.. ఏడుస్తూ పోలీసులకు ఆశ్రయించిన భర్త

CM Revanth Reddy: చదువు-పోరాటం నేర్పింది ఓయూ.. మానవ రూపంలో మృగాలున్నాయి, జాగ్రత్త చెప్పిన సీఎం రేవంత్

Big Stories

×