E-Paper
Advertisement

MIM : ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.. ఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే?

MIM :  ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.. ఎంఐఎం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే?
Advertisement

MIM : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీలో 9 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 2018 ఎన్నికల్లో ఎంఐఎం ఏడు స్థానాల్లో గెలిచింది. ఆ ఏడు సిట్టింగ్‌ స్థానాల్లో తిరిగి పోటీ చేస్తోంది. మరో రెండు స్థానాల్లో పోటీ చేస్తామని అసదుద్దీన్ వెల్లడించారు.

చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పురా, బహుదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్ , మలక్ పేట ఎంఐఎం సిట్టింగ్ స్థానాలు. వీటితోపాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లో పోటీ చేస్తామని ఓవైసీ తెలిపారు.

Advertisement

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. బీఆర్ఎస్ 117 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ గోషామహల్, చార్మినార్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు.

ఇటు కాంగ్రెస్ కూడా ఎన్నికల రణరంగంలో దూసుకుపోతోంది. రెండు జాబితాల్లో మొత్తం 100 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో 19 స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు రాహుల్ గాంధీ వరుసగా బహిరంగ సభల్లో పాల్గొంటూ పార్టీలో జోష్ తీసుకొచ్చారు.

Advertisement

ఎన్నికల రేస్ లో కాస్త వెనుకబడినట్లు ఉన్న బీజేపీ 88 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 31 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకొని హ్యాట్రిక్‌ సాధించాలని గులాబీ బాస్ కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. అలాగే ఈసారి అధికారం దక్కడం ఖాయమన్న ధీమాతో కాంగ్రెస్ ముందుకెళుతోంది. అటు వామపక్షాలు ఒంటరిపోరాటంతో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×