Asia Airlines : ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో జపాన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్, ఏఎన్ఏ గ్రూప్‌లు లాభాల బాట పట్టాయి. జపాన్‌కు చెందిన ఈ విమానయాన సంస్థలు 2020-21 మధ్య కరోనా వైరస్ వల్ల చవిచూసిన నష్టాల నుంచి బయటపడ్డాయి.
ఆసియా ప్రాంతంలో ప్రధాన ఎయిర్‌లైన్స్/ఎయిర్‌లైన్ గ్రూపులు నిరుడు బాగా ఊపిరి తీసుకోగలిగాయి. ఈ రీజియన్‌లోని చైనా సదరన్ గ్రూప్ 13 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఎస్ఐఏ గ్రూప్ 12.7 బిలియన్ డాలర్లు, ఏఎన్ఏ గ్రూప్ 12.6 బిలియన్ డాలర్లు, కొరియన్ ఎయిర్ గ్రూప్ 10.8 బిలియన్ డాలర్లు ఆర్జించాయి.
జపాన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ 10.2 బిలియన్ డాలర్లు, ఎయిర్ చైనా గ్రూప్ 7.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్నిపొందాయి. ఇక భారత్‌కు చెందిన ఇండిగోవిమానయాన సంస్థ రెవెన్యూ 7.1 బిలియన్ డాలర్లుగా ఉంది. చైనా ఈస్ట్రన్ గ్రూప్ ఆదాయం 6.9బిలియన్ డాలర్లు.