E-Paper
Advertisement

Jupally Krishna Rao: రైతులకు న్యాయమైన ధర కల్పించడం ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు

Jupally Krishna Rao: రైతులకు న్యాయమైన ధర కల్పించడం ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు
Advertisement

Jupally Krishna Rao:  స్వేచ్ఛ, బ్యూరో:  రైతులకు న్యాయమైన ధర కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. కొల్లాపూర్ మండలం కొప్పునూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన శనగ పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,875కు కొనుగోలు చేస్తామని తెలిపారు.

Also Read: EV Summer Tips: సమ్మర్ లో ఎలక్ట్రిక్ కారు వాడుతున్నారా? ఏసీ విషయం లో జాగ్రత్త!

రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి 

Advertisement

కొనుగోలు ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు పాటించడం ముఖ్యమని, శనగలో తేమ శాతం 14 శాతం లోపే ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు. రైతులకు మద్దతుగా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, మార్క్‌ఫెడ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Ban On SRH: స‌న్ రైజ‌ర్స్ టికెట్ కొంటే, పాకిస్తాన్ ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషించిన‌ట్లే !

Related News

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

Big Stories

Advertisement
×