E-Paper
Advertisement

Minister Seethakka: ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన మంత్రి సీతక్క.. మీ కుట్రలు సాగవని హెచ్చరిక..!

Minister Seethakka: ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన మంత్రి సీతక్క.. మీ కుట్రలు సాగవని హెచ్చరిక..!
Advertisement

Minister Seethakka: ములుగు స్వేఛ్చ బ్యూరో: ప్రపంచ ప్రఖ్యాత శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర ప్రతిష్టను దెబ్బతీసేలా కావాలనే కొంతమంది రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు, కొందరు స్వాములు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మేడారం జాతర నిర్వహణలో భాగంగా వారం రోజుల పాటు తాము 24 గంటలు అక్కడే ఉండి పనిచేశామని, కోట్లాది మంది భక్తులు సుఖశాంతులతో దర్శనం చేసుకున్నారని తెలిపారు. జాతరను సక్సెస్ చేయడంలో సహకరించిన ములుగు జిల్లా మీడియా సోదరులకు, అధికారులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

సమ్మక్క గద్దెల వద్ద కూడా రాజకీయాలు

గుడి నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచే ఆదివాసీ విశ్వాసాలకు వ్యతిరేకమని తప్పుడు ప్రచారాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. గుడిలో చేసిన ప్రతి మార్పు పూజారుల ఆమోదం, ఎండోమెంట్ కమిషనర్ అనుమతితోనే జరిగిందని స్పష్టం చేశారు. అయినప్పటికీ సమ్మక్క గద్దెల వద్ద కూడా రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. శుక్రవారం సాయంత్రం విఐపి వాహనాలు భారీగా రావడంతో కొంతసేపు ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడిందని, అది బస్సులు లేకపోవడం వల్ల కాదని తెలిపారు. గత జాతరలతో పోలిస్తే ఈసారి ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గాయని పేర్కొన్నారు. కొంతమంది విఐపిలు వందలాది మందితో, అనేక వాహనాలతో రావడం వల్లే ఇబ్బందులు తలెత్తాయన్నారు. వ్యక్తిగత భూముల్లో జరిగిన చిన్న వ్యాపారాలను కూడా దందాలుగా చిత్రీకరించడం కుట్రపూరితమని మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లో ఎవరైనా అక్రమాలు చేస్తే తామే బాధ్యత వహిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Also Read: World Cup Sale: రూ.99,999 ప్రొజెక్టర్ కేవలం రూ.30,999కే.. స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై 65 శాతం వరకు డిస్కౌంట్

జాతరలో 13 వేల మంది పోలీసులు

జాతరలో ప్రమాదాలు జరుగుతాయని, ప్రాణనష్టం జరుగుతుందని యూట్యూబ్‌లు, టీవీ ఛానళ్లలో చేసిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఈసారి మాస్‌తో పాటు క్లాస్, సూపర్ క్లాస్ భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడం కొందరికి జీర్ణించుకోలేక నెగటివ్ నరేటివ్‌ను సృష్టిస్తున్నారని విమర్శించారు. రాజకీయాలపై మాట్లాడితే మాట్లాడొచ్చుగానీ, దేవతలను, జాతరను కించపరచడం సహించబోమన్నారు. జాతరలో 13 వేల మంది పోలీసులు, 40 రోజుల పాటు జిల్లా యంత్రాంగం సేవలందించిందని తెలిపారు. తాగునీటి ట్యాంకులు, చలివేంద్రాలు, టాయిలెట్లు, షెడ్లు, తల్లులు,పిల్లల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశామని వివరించారు. చిన్నచిన్న లోపాలు ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకుంటామని తెలిపారు. సమ్మక్క, సారలమ్మలు అన్ని కులాలు, అన్ని మతాలు నమ్మే ప్రకృతి దేవతలని, వారి కీర్తిని తగ్గించే కుట్రలను తక్షణమే మానుకోవాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటమే తమ బాధ్యతని స్పష్టం చేశారు.

Advertisement

Also Read: Bandam Kunta: అక్రమార్కుల చేతిలో మాయమవుతున్న బంధం కుంట.. పట్టించుకోని అధికారులు

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×