BigTV English

Telangana Student Missing In Chicago: అమెరికాలో మిస్సవుతున్న భారతీయ విద్యార్థులు.. ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్!

Telangana Student Missing In Chicago: అమెరికాలో మిస్సవుతున్న భారతీయ విద్యార్థులు.. ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్!

Telangana Student Missing in Chicago: అమెరికాలో భారతీయ విద్యార్థుల మిస్సింగ్, మరణాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా అమెరికాలోని చికాగోలో భారతీయ స్టూడెంట్ అదృశ్యమయ్యాడు.మే రెండున చింతకింది రూపేశ్ అనే స్టూడెంట్ మిస్సయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చికాగోలోని భారత రాయబారి కార్యాలయం వెల్లడించింది. మే రెండు నుంచి రూపేశ్ కనిపించలేదని, అతడి ఆచూకీ కోసం పోలీసులు శ్రమిస్తున్నట్లు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. అతడి గురించి సమాచారం తెలిస్తే వెంటనే అందించాలని స్థానికులను కోరింది.


తెలంగాణకు చెందిన రూపేశ్ చికాగోలోని విస్కాన్సిన్‌లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. ఈయన సొంతూరు హనుమకొండ జిల్లా. ఈ విషయం చికాగోలోని రాయబారి కార్యాలయం ద్వారా తెలియగానే అతడి కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే రూపేశ్ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. టెక్సాస్‌లో ఓ వ్యక్తి వద్దకు వెళ్లినట్టు చెబుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తమకు తెలీదని రూమ్‌మేట్స్ మాట.

అమెరికాలో తన కొడుకు రూపేశ్ మిస్సింగ్ వ్యవహారాన్ని ఆయన ఫాదర్ సదానందమ్.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విదేశాంగ‌శాఖకు ఓ లేఖ రాశారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ.. అమెరికా ఎంబసీని అభ్యర్థించింది. తమ గడ్డపై భారతీయ విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని అక్కడి పాలకులు చెబుతున్నారు. అయినా సరే జరగాల్సిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.


Also Read: గూచీ బెల్ట్ కొనిచ్చి విద్యార్థితో శృంగారం.. బెయిల్ పై బయటికొచ్చి మరో విద్యార్థితో..

ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికాలో ఈ తరహా ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. దాడులు, కిడ్నాప్ వంటి ఘటనల్లో ఇప్పటికే పలువురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇది వరుసగా ఐదో ఘటన. ఇటీవల పర్ఢ్యూ యూనివర్సిటీలో అనుమానాస్పద స్థితిలో ఇండియన్ స్టూడెంట్ మరణించాడు.

mysterious deaths of Indian students in US
mysterious deaths of Indian students in US

అంతకుముందు ఓహియో ప్రాంతంలో భారతి సంతతికి చెందిన 19 ఏళ్ల శ్రేయస్‌రెడ్డి ఇదే విధంగా మరణించాడు. జార్జియాలో లిథోనియాలో హర్యానాకు చెందిన వివేక్ సైనీని ఓ వ్యక్తి సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అంతకుముందు ఇల్లినాయిస్ యూనివర్సిటీ సమీపంలో భారతీయ-అమెరికన్ విద్యార్థి అకుల్‌ధావన్ శవమై కనిపించాడు. ఇలా వరసగా అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Also Read: Teacher illegal Affair : గూచీ బెల్ట్ కొనిచ్చి విద్యార్థితో శృంగారం.. బెయిల్ పై బయటికొచ్చి మరో విద్యార్థితో..

Tags

Related News

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Big Stories

×