BigTV English

Minister Seethakka: ఏడేళ్ల తర్వాత డైట్ ఛార్జీలు 40 శాతం పెంచాం.. మంత్రి సీతక్క

Minister Seethakka: ఏడేళ్ల తర్వాత డైట్ ఛార్జీలు 40 శాతం పెంచాం.. మంత్రి సీతక్క

Minister Seethakka: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీల పెంపుపై అసెంబ్లీలో మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. ఏడేళ్ల తర్వాత డైట్ చార్జీలు 40 శాతం పెంచామని..  16 ఏళ్ల తర్వాత కాస్మోటిక్ చార్జీలు 212 శాతం పెంచామన్నారు సీతక్క. తాను కూడా ములుగులోని ఎస్టీ గర్ల్స్‌ హాస్టల్‌లో చదివినట్టు గుర్తు చేశారు. ఆనాడు అవకాశాలు తక్కువగా ఉన్నా ఎంతోమంది పట్టుదలగా చదువుకొని అత్యున్నత స్థానాల్లోకి వచ్చారని తెలిపారు.


ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఓసీలలో కూడా పేదలు పెద్ద ఎత్తున హాస్టల్ లోకి వస్తున్నారని, సరైన తిండి పౌష్టికాహారం లేకుంటే.. చదువుకునే టైంలో అర్థాకళి కడుపు మాడుతుంటే.. చదువుకోవడం ఇబ్బందిగా ఉంటుందన్నారు.

అందుకే పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున డైట్ చార్జీలు, కాస్మోటిక్ పెంచారని వివరణ ఇచ్చారు. పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కాబట్టి.. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.


విద్యార్థుల దేశ మానవ వనరులు, వారి జీవితాలను సమన్నతంగా పెంచేందుకు వాళ్ళ నాలెడ్జ్‌ను పెంచేందుకు పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకొని చర్యలు చేపడుతామన్నారు. ఆహారము కల్తీ జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హాస్టల్లో బసవిస్తున్నారని తెలిపారు. మంచి విద్య, పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నాం అని వెల్లడించారు.

నాలుగు నెలల కాలంలో రూ.499 కోట్లకుపైగా ఖర్చు చేశామని, కేంద్ర ప్రభుత్వం స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్‌లను రద్దు చేసింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, నూతన విద్యా విధానమని పెద్దపెద్ద మాటలు చెప్పి విద్యార్థులకు అందే స్కాలర్షిప్‌ల విధానాన్ని రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యారంగం మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి.. బొట్టు పసే తప్ప బోనం లేదన్నట్టుగా ఉందని సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి కుటుంబీకులే ప్రభుత్వము మీద ఆధారపడతారు కాబట్టి.. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ఈ నేపథ్యంలో అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ప్రశ్నపై మంత్రి సీతక్క ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య సంవాదం చోటుచేసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం మొదలు పెట్టిన విదేశీ విద్యకు ఇచ్చే 20 లక్షలు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి ఇవ్వలేదని.. ప్రభుత్వ వెబ్ సైట్ డీటెయిల్స్ సభలో ఎమ్మెల్యే గంగుల ప్రవేశపెట్టారు. బీసీ, ఎస్టీ, మైనార్టీలకు ఒక్కరికీ కూడా ఇవ్వలేదని.. ఎస్సీ కొంతమందికి ఇచ్చారని.. ప్రభుత్వ వివరాలే ఇవి అని సంబంధిత డౌన్ లోడ్ డాక్యుమెంట్ స్పీకర్ కు ఎమ్మెల్యే గంగుల పంపారు. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నదని గంగుల ఆరోపించారు.

గంగుల కమలాకర్ దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారని మంత్రి సీతక్క పైర్ అయ్యారు. మీరు పెండింగ్ పెట్టి పోతే క్లియర్ చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటికే రూ. 167 కోట్లు విడుదల చేశాం అని.. మిగతా రూ. 25 కోట్లు కూడా విడుదల చేస్తాం అని సీతక్క తెలిపారు. పథకాన్ని కొనసాగిస్తున్నామని విద్య విషయంలో రాజకీయం చేయొద్దని సీతక్క మండిపడ్డారు. బడుగుబలహీన వర్గాల పిల్లలకు సంబంధించిన విదేశీ విద్య అంశంపై మంత్రి సీతక్క తప్పు లెక్కలు చెప్పారని ఎమ్మెల్యే గంగుల వాదించగా.. ఆదివారం.. వెబ్ సైట్ ఆపరేట్ చేయరు. అయినా వివరాలు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. తాను వాళ్ళలా ప్రైవేట్ కాలేజీల్లో బిటెక్‌లు చదవలేదు.. గిరిజన బాలికల స్కూల్ లో చదివానని.. సమాజం నుండి నేర్చుకున్న కాబట్టే ఇక్కడ వరకు వచ్చానని తెలిపిన మంత్రి సీతక్క అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన దృష్టికి తీసుకెళ్తానని మంత్రి సీతక్క తెలిపారు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×