Puri Jagannadh: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగ్గనాథ్ అంటే సినీ అభిమానులకి చాలా ఇష్టం. డైరెక్టర్స్ కి స్టార్ డమ్ తెచ్చిన ఫస్ట్ డైరెక్టర్ పూరినే, లైఫ్ ఫిలాసఫి చెప్పడంలో పూరి దిట్ట అందుకే అతని ఫ్యాన్స్ కల్ట్ గా ఉంటారు. ఒక్క డైలాగ్ తో హీరోని ఎలివేట్ చేయడం, సాలిడ్ క్యారెక్టర్ ని హీరోకి డిజైన్ చేయడం పూరి స్టైల్. మహేష్ బాబుని పోకిరి చేసాడు, ఎన్టీఆర్ ని దయ చేసాడు, బాలయ్యని తేడా సింగ్ చేసాడు, ప్రభాస్ ని బుజ్జిగాడుగా మార్చాడు. ఇలా పూరి ఏ హీరోతో సినిమా చేస్తే అది ఆ హీరో కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యేది.
రాజమౌళి లాంటి డైరెక్టర్ కి కూడా ఫేవరేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే, ఆయన స్టాండర్డ్ ఆఫ్ రైటింగ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి పూరి జగన్నాథ్ కి ప్రస్తుతం బాడ్ ఫేజ్ నడుస్తోంది. ఏ హీరోతో ఏ ప్రాజెక్ట్ చేసినా దాని రిజల్ట్ మాత్రం తేడగానే వస్తోంది. అందుకే పూరి రూట్ మార్చాల్సిన సమయం వచ్చింది అని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పూరికి మెసేజస్ పెడుతున్నారు.
కథల విషయంలో చాలా స్పీడ్ గా ఉండే పూరి, ప్రాజెక్ట్ ని ట్రాక్ ఎక్కించడానికి మాత్రం ఈసారి చాలా టైం తీసుకుంటున్నాడు. ఇందుకు కారణం పూరి స్టార్ యాక్టర్ ని ట్రై చేస్తూ ఉండడమే అని సమాచారం. అన్నీ సెట్ అయితే పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే టాక్స్ జరుగుతూ ఉన్నాయి, త్వరలో ఈ కాంబినేషన్ పై క్లారిటీ వస్తుందని కోలీవుడ్ వర్గాల టాక్.
సేతుపతికి ఇప్పటికే పూరి కథ కూడా చెప్పాడని సమాచారం. స్క్రిప్ట్ సెలక్షన్ పర్ఫెక్ట్ గా ఉండే సేతుపతి ఒకే చేసాడు అంటే పూరి ఈసారి మంచి కథతోనే వస్తున్నట్లు ఉన్నాడు. నిజానికి పూరి నెక్స్ట్ సినిమా బాలయ్యతో లేదా కన్నడ సూపర్ స్టార్ శివన్నతో ఉండాల్సింది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండడం వలన ప్రాజెక్ట్స్ సెట్ కాలేదని టాక్.
బాలయ్య అఖండ 2 అయ్యాక గోపీచంద్ మలినేని, బాబీ దర్శకత్వంలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ అయ్యాకే పూరి సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అప్పటివరకూ ఆగడం కన్నా పూరి జగన్నాథ్, ఆలోపు సేతుపతితో హిట్ కొట్టి సక్సస్ ట్రాక్ ఎక్కితే, తెలుగులో మళ్లీ పూరితో సినిమాలు చేయడానికి మన హీరోలు క్యూ కడతారు. మరి సేతుపతి-పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? ఎలాంటి కథతో పూరి కంబ్యాక్ ఇస్తాడు అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.