క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ యువకుడి చివరి కోర్కె నెరవేర్చారు మంత్రి శ్రీధర్ బాబు. క్రికెట్ కిట్ అందజేసి అతడి కళ్లలో ఆనందం చూశారు. అదే సమయంలో మంత్రి కళ్లు చెమర్చాయి. చావు అంచుల్లో ఉన్న ఆ యువకుడి పరిస్థితి చూసి మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలంటూ తల్లిదండ్రులకు సూచించారు. భారంగా ఆస్పత్రి వార్డు నుంచి ఆయన బయటకు వెళ్లారు.
ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుడైన భౌత్ నితిన్ ని పరామర్శించేందుకు వెళ్లానని, అక్కడ జరిగిన సంఘటనతో తన కళ్లు చెమర్చాయని, ఆ యువకుడి మాటలు తమన మనసుని తాకాయంటూ మంత్రి శ్రీధర్ బాబు ట్వీట్ చేశారు. నితిన్ కి తాను అండగా నిలబడతానని మాటిచ్చారు.
Great way to get inspired!
Met an inspiring young boy, Bhouth Nithin, from Sarvai Peta village in Palimala Mandal, Bhupalpally district, who's bravely fighting cancer at Sparsh Hospital in Hyderabad. His words touched my heart: "Sir, I love cricket. I dream of becoming a great… pic.twitter.com/L43x372yXP
— Sridhar Babu Duddilla (@OffDSB) March 25, 2025
“సార్, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పెద్ద క్రికెటర్ కావాలని కలలుకన్నా. నాకో క్రికెట్ కిట్ ఇప్పించండి సార్” ఆస్పత్రిలో తనని పరామర్శించడానికి వచ్చిన మంత్రి శ్రీధర్ బాబుతో నితిన్ చెప్పిన మాటలివి. నితిన్ సొంత ఊరు భూపాలపల్లి జిల్లా పాలిమల మండలం సర్వాయ్ పేట గ్రామం. కొన్నాళ్లుగా నితిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. ఆరోగ్యం మెరుగుపడలేదు సరికదా నానాటికీ క్షీణిస్తోంది. ప్రస్తుతం నితిన్ ఖాజగూడలోని స్పర్ష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలో ఏం కావాలంటూ నితిన్ ని అడిగారు మంత్రి. తనకు క్రికెట్ కిట్ కావాలని అడిగాడు నితిన్. మంత్రి వెంటనే తన సిబ్బందిని పంపించి క్రికెట్ కిట్ తెప్పించారు.
ఆస్పత్రి బెడ్ పై పడుకుని ఉన్న నితిన్ కి హెల్మెట్ పెట్టించి, చేతిలో క్రికెట్ కిట్ పెట్టారు. ఆ క్రికెట్ కిట్ చూసి నితిన్ ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. తనకున్న అనారోగ్యం కూడా ఆ క్షణంలో అతడికి గుర్తు రాలేదు. చిన్నప్పటి నుంచి నితిన్ ఆటల్లో చురుగ్గా ఉండేవాడు. గల్లీ క్రికెట్ తోపాటు, కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే మ్యాచ్ లలో మంచి ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా ఎదగాలనుకున్నాడు. కానీ విధి చిన్నచూపు చూడటంతో నితిన్ కి క్యాన్సర్ సోకింది. ఆ మహమ్మారితో పోరాటం చేస్తూ నితిన్ ఆస్పత్రిలో చేరాడు.
నితిన్ కి క్యాన్సర్ సోకిందని తెలియడంతో మంత్రి శ్రీధర్ బాబు అతడిని కలిసేందుకు ఆస్పత్రికి వెళ్లాడు. బెడ్ పై అచేతనంగా ఉన్న నితిన్ ని చూసి చలించిపోయారు. అదే సమయంలో ఆ యువకుడి కోరిక విని ఆశ్చర్యపోయాడు. తనకు క్రికెట్ కిట్ కావాలంటూ నితిన్ అడగగానే వెంటనే తెప్పించి ఇచ్చాడు. ఆ యువకుడి చివరి కోర్కె తీర్చాడు. నితిన్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్ బాబు చొరవతో సంతోషపడ్డారు. తమ బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలని వారు భావిస్తున్నారు. వారికి అవసరమైన సాయం చేస్తానని మంత్రి కూడా హామీ ఇచ్చారు. నితిన్ కి ఒక అన్నలాగా తాను అండగా నిలబడతానన్నారు శ్రీధర్ బాబు.