Methi Sprouts: మొలకెత్తిన మెంతులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే ప్రోటీన్ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి , కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది.
మొలకెత్తిన మెంతుల్లో కరగని, కరిగే ఫైబర్‌లు ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది . అంతే కాకుండా మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను తొలగిస్తుంది. ఇది నాడీ వ్యవస్థ , శక్తి ఉత్పత్తకి అవసరమైన విటమిన్ ఎ , విటమిన్ బి లను కలిగి ఉంటుంది .
మెంతులు పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, ఇనుము వంటి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి పళ్లు ఎముకల అభివృద్ధికి సహాయపడతాయి. మెంతులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. కఫ, వాత దోషాలను సమతుల్యంగా ఉంచడం కోసం మొలకెత్తిన మెంతులు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. అంతే కాకుండా కొలెస్ట్రాల్‌తో పాటు మధుమేహం వంటి ఇతర వ్యాధులు ఉన్న వారు మొలకెత్తిన మెంతులను తినడం మంచిది.
కొలెస్ట్రాల్ కోసం మెంతులు ఎంత మోతాదులో తీసుకోవాలి ?
మెంతి గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడం, బరువు తగ్గడం, జుట్టును సిల్కీగా , మెరిసేలా చేయడం వరకు.. మెంతి గింజలు అనేక రకాల సమస్యలకు గొప్ప నివారణగా పనిచేస్తాయి. మొలకెత్తిన మెంతులు తినడం గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మొలకెత్తిన మెంతులు ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. అంతే కాకుండా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
రక్తంలో చక్కెర నియంత్రణ:
మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు. మధుమేహ రోగులు మొలకెత్తిన మెంతులు తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. మొలకెత్తిన మెంతులలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది సోడియం స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. దీంతో పాటు ఇది రక్తపోటు , హృదయ స్పందనను కూడా సమతుల్యం చేస్తుంది.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది:
మొలకెత్తిన మెంతులు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ సూపర్ ఫుడ్ గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మెంతుల్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది కడుపు సంబంధిత వ్యాధులన్నింటి నుండి దూరంగా ఉంచుతుంది.
మొలకెత్తిన మెంతులను ఉదయం ఖాళీ కడుపుతో రెండు వారాల పాటు తీంటే.. అనేక వ్యాధులను నియంత్రించవచ్చు. ఉదయం పూట వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతే కాకుండా గ్యాస్ ,అజీర్ణాన్ని తొలగించడంతో పాటు, ఇది బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. రాత్రి భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత కూడా మీరు మొలకెత్తిన మెంతులను తినవచ్చు.
Also Read: ఇంట్లోనే ఇలా నేచురల్ హెయిర్ కలర్స్ తయారు చేసుకుని వాడితే.. తెల్ల జుట్టు మాయం
మొలకెత్తిన మెంతులను ఎంత మోతాదులో తినాలి ?
ప్రతి రోజు ఉదయం ఒకటి లేదా రెండు చెంచాల మొలకెత్తిన మెంతులు తినడం మంచిది. ప్రారంభంలో తక్కువ పరిమాణంలో మొలకెత్తిన మెంతులను తినడానికి ప్రయత్నించండి. వీటిని తిన్న తర్వాత మీకు ఎలాంటి సమస్యలు లేకపోతే మీరు పరిమాణాన్ని పెంచవచ్చు. మీరు ఒకటి నుండి రెండు చెంచాల మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. మొలకెత్తిన మెంతుల గింజలను సలాడ్‌లో కలిపి కూడా తినవచ్చు. దీనివల్ల ఎక్కువ పోషకాలు లభిస్తాయి. మొలకెత్తిన మెంతులను పెరుగుతో కలిపి కూడా తినొచ్చు.