Tollywood: ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు అలా వివాహం చేసుకొని ఇలా తల్లిదండ్రులవుతున్న విషయం తెలిసిందే. మొదట తమకు నచ్చిన వారితో డేటింగ్ చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనీ, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకొంతమంది పెళ్లి కాకముందే బిడ్డలకు జన్మనిచ్చి, ఆ తర్వాత విభేదాలు రావడంతో విడిపోతున్నారు. ఇంకొంతమంది అలా తమకు నచ్చిన వారిని మళ్లీ వివాహం చేసుకొని బిడ్డలకు జన్మనిస్తున్న విషయం తెలిసిందే.ఇలాంటి క్యాటగిరీలో ఎంతోమంది హీరోయిన్స్ సినీ ఇండస్ట్రీలో మనకు తారసపడతారు.ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ కూడా చేరిపోయింది. తాజాగా అభిమానులతో గుడ్ న్యూస్ చెప్పిందిm పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అటు సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆమె తన బిడ్డకు పేరు కూడా పెట్టేసి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు అమీ జాక్సన్ (Ami Jackson) .. తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితమే . ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘ఎవడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. అంతేకాదు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ (Vikram ) హీరోగా వచ్చిన ‘ఐ’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి అలరించింది.
Betting Apps Case: విచారణకు డుమ్మా కొట్టిన రీతూ చౌదరి.. పోలీసుల నెక్స్ట్ స్టెప్ అదేనా..?
మరో బిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్..
ఇక ఈ చిత్రాలతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, సినిమాలలో నటించి ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు విదేశాలలో స్థిరపడిపోయింది. ఇక 2015 నుండి 2021 వరకు హోటల్ వ్యాపారి అయినా జార్జ్ పనాయోటౌ తో రిలేషన్షిప్ కొనసాగించిన ఈమె.. 2019లో అతనితో నిశ్చితార్థం చేసుకుంది. అదే సంవత్సరంలో ఒక ఆడబిడ్డను కూడా ప్రసవించింది. అయితే అప్పటికి వారికి పెళ్లి కాలేదు. కానీ 2021లో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత ఆంగ్ల నటుడైన ఎడ్ వెస్ట్ విక్ తో పరిచయం ఏర్పడి,డేటింగ్ చేయడం ప్రారంభించింది. ఆగస్టులో పెళ్లి కూడా చేసుకుంది. ఆ తర్వాత అక్టోబర్లో మరోసారి గర్భం దాల్చిన ఈమె.. ఆ తర్వాత బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాదు బికినీలో కూడా బేబీ పంప్ చూపిస్తూ కొత్త ఫోటోలు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
పేరు కూడా పెట్టేసిన అమీ జాక్సన్..
ఇక ఇప్పుడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అలాగే తన కొడుకుకు పేరు కూడా పెట్టినట్లు తెలిపింది. తన కొడుకుకు ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్ విక్ అనే పేరు పెట్టినట్లు అభిమానులతో తెలియజేసింది. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి అభిమానుల సైతం ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మొత్తానికి అయితే అమీ జాక్సన్ రెండవసారి తల్లి అయ్యి.. మరో బిడ్డకు జన్మనిచ్చిందని చెప్పవచ్చు.