BigTV English

HCU : కేటీఆర్‌కు క్లియర్ కట్ ఆన్సర్స్.. ఎనీ డౌట్స్?

HCU : కేటీఆర్‌కు క్లియర్ కట్ ఆన్సర్స్.. ఎనీ డౌట్స్?

HCU : కేటీఆర్ ప్రెస్‌మీట్‌ పెట్టి ఆ 400 ఎకరాలపై పలు ఆరోపణలు చేశారు. 5వేల కోట్ల విలువైన భూములను 30 వేల కోట్లని చెప్పి కుదవబెట్టారని అన్నారు. ICICI బ్యాంక్ నుంచి బాండ్ల రూపంలో 10 వేల కోట్లు తీసుకున్నారని.. ఇదంతా స్కాం అన్నారు. కేటీఆర్ విమర్శలపై తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి శ్రీధర్‌బాబు క్లియర్ కట్ సమాధానాలు చెప్పారు.


ఆ బ్యాంక్ ఏం చేసిందంటే..

5,200 కోట్ల భూమిని.. 30వేల కోట్లకు చూపించారని కేటీఆర్ అంటున్నాడని.. కానీ, సెక్యూరిటీ బ్యూరో ఆప్ ఇండియా అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం ఆ భూమికి 23 వేల కోట్ల వాల్యూ ఉన్నట్టు నివేదిక వచ్చిందని శ్రీధర్‌బాబు అన్నారు. ఈ విషయాన్ని SEBI, RBI సైతం నిర్దారణ చేసిందన్నారు. ICICI ఎలాంటి లోన్ ఇవ్వలేదని.. ఆ బ్యాంక్ దగ్గర మార్టిగేజ్ కూడా చేయలేదని చెప్పారు. TGIIC కి చెందిన బ్యాంక్ అకౌంట్ మాత్రమే ICICI దగ్గర ఉందని అన్నారు.


రుణ మెంత? రణ మెంత?

TGIIC మార్కెట్ ఫోర్ సెస్ ద్వారా 37 అంతర్జాతీయ సంస్థల నుంచి మ్యూచువల్ పెట్టుబడుల బాండ్ల ద్వారా ప్రభుత్వం నిధులు సేకరించిందని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. తక్కువ ఇంట్రెస్ట్ కే సంక్షేమం కోసం ఆ ఫండ్స్ సేకరించామని తెలిపారు. 2024 డిసెంబర్ 5న.. 9వేల 995 కోట్లు బాండ్ల ద్వారా నిధులు సేకరించామని వివరించారు. ఇంట్రెస్ట్ రేట్ 9.35 శాతం అని చెప్పారు. SEBIలో రిజిస్టరైన మర్చంట్ బ్యాంకర్‌ను TGIIC నియమించుకుందని అన్నారు. రైతుల సంక్షేమం, రైతు భరోసా, రైతు రుణమాఫీకి ఆ నిధులను ఉపయోగించామని శ్రీధర్‌బాబు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం REC, PFC, BOB నుంచి 10.09% వడ్డీకి రుణాలు తీసుకుందని గుర్తు చేశారు.

Also Read : వర్షిణి నెగ్గిందా? ఓడిందా? ఈ ప్రశ్నలకు బదులేది?

గులాబీ కుట్రలు బద్దలు..

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని BRS కుట్రలు చేస్తోందని శ్రీధర్ బాబు మండిపడ్డారు. HCU భూములపై సుప్రీంకోర్టులో ఎలాంటి కేసులు లేవన్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని విమర్శించారు. తొమ్మిది ఏళ్ల క్రితం రాజస్థా‌న్‌లో చనిపోయిన జింక పిల్లను HCUలో చనిపోయినట్టు చూపించారని తప్పుబట్టారు. HCU పరిసర ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నట్టు AI తో క్రియేట్ చేసి ఫేక్ ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్‌బాబు.

Related News

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండి కుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Big Stories

×