BigTV English

Dark circles: కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌ని అలాగే వదిలేయకండి.. ఇలా చేస్తే కళ్లు అందంగా మారతాయి

Dark circles: కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌ని అలాగే వదిలేయకండి.. ఇలా చేస్తే కళ్లు అందంగా మారతాయి

Dark circles: కళ్ల కింద డార్క్ సర్కిల్స్ రావడం అనేది ఇప్పుడు ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఇవి వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. చాలా మందికి డార్క్ సర్కిల్స్ వంశపారంపర్యంగా కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తగ్గించడం కాస్త కష్టమే. కొంతమందికి కళ్ల కింద చర్మం సన్నగా ఉంటుంది. ఇది రక్త నాళాలు మరింత కనిపించేలా చేస్తుంది. ఈ చర్మం ముదురు రంగులోకి మారడం వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు వచ్చినట్టుగా కనిపిస్తుంది.


డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి?
వయసు పెరిగే కొద్దీ, చర్మం కొల్లాజెన్‌ని కోల్పోయి, సన్నబడుతూ ఉంటుంది. దీంతో కళ్ల కింద ఉన్న రక్తనాళాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారిలో దాదాపు అందరికీ నిద్రలేమి కారణంగా ఇలా జరుగుతుంది.

సరిగా నిద్ర లేకపోవడం వల్లనే చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది, మరికొందరిలో లేతగా కనిపిస్తుంది. దీని వలన రక్త నాళాలు మరింత క్లియర్‌గా కనిపిస్తాయి. డార్క్ సర్కిల్స్‌ని అలాగే వదిలేస్తే పఫ్నెస్‌ కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కళ్ల చుట్టూ ఉండే చర్మం ఎక్కువ ముదురు రంగులోకి మారే అవకాశం ఉందట.


మరికొందరిలో అలెర్జీ వల్ల కళ్లు దురదగా అనిపిస్తాయట. ఎక్కువగా రుద్దడం వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలను మరింత పెరిగిపోతాయి. అలెర్జీలతో వచ్చే మంట, వాపు కూడా డార్క్ సర్కిల్స్‌కు కారణం అవుతుందట.

అంతేకాకుండా శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు డార్క్ సర్కిల్స్ వస్తాయట. శరీరంలో నీటి శాతం తగ్గిపోతే కళ్ల కింద చర్మం మరింత బోలుగా, ముదురు రంగులోకి మారుతుంది. ఆరోగ్యకరమైన, హైడ్రేటెడ్ చర్మాన్ని పొందేందుకు తగినంత నీరు తాగడం ముఖ్యం.

ఎక్కువ సమయం పాటు సూర్యరశ్మిలో ఉండడం వల్ల కళ్ల కింద చర్మంలో హైపర్‌పిగ్మెంటేషన్‌కు కారణమవుతుంది. సూర్యరశ్మి మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో డార్క్ సర్కిల్స్ ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. మరికొందరిలో విటమిన్ K, C, ఐరన్ లోపం వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందట. ఆరోగ్యకరమైన చర్మానికి సమతుల్య ఆహారం ముఖ్యమని నిపుణులు చెబుతారు.

ALSO READ: టోక్యో నగరంలో కార్లే తిరగవా..?

డార్క్ సర్కిల్స్‌కు గుడ్ బై చెప్పడమెలా..?

డార్క్ సర్కిల్స్‌ రాకుండా ఉండాలంటే ప్రతి రాత్రి 7-9 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రశాంతమైన నిద్ర వాపును తగ్గించడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుందట.

డీహైడ్రేషన్ వల్ల కళ్ల కింద చర్మం మరింత డార్క్‌‌గా కనిపిస్తుందట. అందుకే రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. కళ్లకు కోల్డ్ కంప్రెస్‌ని అప్లై చేయడం వల్ల వాపు తగ్గుతుంది మరియు రక్త నాళాలు కుదించబడతాయి, ఇది డార్క్ సర్కిల్స్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది.

నెచురల్ రెమెడీస్ పని చేయకుంటే కొన్ని రకాల విటమిన్స్ ఉండే క్రీంలను వాడితే మంచిదని డెర్మటాలజిస్ట్‌లు సూచిస్తున్నారు. విటమిన్ సి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. రంగు మారడాన్ని తగ్గిస్తుంది. అలాగే చర్మాన్ని రక్షించే కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడానికి రెటినోల్ సహాయపడుతుంది. నల్లటి వలయాలను తగ్గించడంతో పాటు చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి హైలురోనిక్ యాసిడ్ హెల్ప్ చేస్తుందట. ఈ రకమైన ప్రోటీన్స్ ఉండే క్రీంలు డార్క్ సర్కిల్స్‌ని తగ్గించేందుకు సహాయం చేస్తాయట.

చర్మ ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్-ఎ, సి, ఇ, కె అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా కళ్ల కింద ఉన్న డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరికొందరిలో నల్లటి వలయాలు రక్తహీనత వల్ల కూడా వస్తాయి. వారు ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. అలెర్జీల వల్ల నల్లటి వలయాలు వస్తే, యాంటి హిస్టామైన్లు లేదా ఇతర చికిత్సలతో తగ్గించే ప్రయత్నం చేయడం మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×