BigTV English

Hunger Strike for I Phone: ఐ ఫోన్ కోసం 3 రోజులు నిరాహార దీక్ష.. యువకుడిపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Hunger Strike for I Phone: ఐ ఫోన్ కోసం 3 రోజులు నిరాహార దీక్ష.. యువకుడిపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Flowers Seller Son 3 days Hunger strike for I Phone: ఐ ఫోన్. దానికి ఉండే క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఐ ఫోన్ అంటే బాగా డబ్బున్నోళ్లు వాడే ఫోన్. కానీ ఇప్పుడు.. జేబులో రూపాయి లేకపోయినా.. అప్పు చేసి మరీ ఐ ఫోన్లు కొనేస్తున్నారు. వాళ్లకి వచ్చే జీతంతో సంబంధం లేదు. ఐ ఫోన్ వాడుతున్నారంటే.. వాళ్ల రేంజే వేరు అని అందరూ అనుకోవాలి. ఇలాంటి పోకడలకు పోయి.. ఉన్న జీవితాన్ని నాశనం చేసుకున్నవారు లేకపోలేదు. కోటానుకోట్లు డబ్బున్నోళ్లే కాదు.. భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఐ ఫోన్ కొన్న వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయింది.


ఐ ఫోన్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ వర్షన్ వస్తూనే ఉంటుంది. అయితే.. చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసే వాళ్లు ఈఎంఐ ఆప్షన్ లో ఐ ఫోన్ కొన్నారంటే కాస్త ఫర్వాలేదు. కానీ.. స్కూల్ కి, కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు కూడా ఐ ఫోన్ కోసం తల్లిదండ్రులనే బెదిరిస్తున్నారు. తాజాగా.. ఓ ఆలయం వద్ద పూలను అమ్మి కుటుంబాన్ని పోషించే మహిళ కొడుకు.. తనకు ఐ ఫోన్ కొనివ్వాలని మూడు రోజులు నిరాహార దీక్ష చేసిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

Also Read: రిస్కీ స్టంట్ వేశాడు.. నీట మునిగి మరణించాడు.. వీడియో వైరల్


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పువ్వులు అమ్మే మహిళ, ఆమె కొడుకు ఒక మొబైల్ షాప్ లో డబ్బుల కట్ట పట్టుకుని నిలబడి ఉన్నారు. ఐ ఫోన్ ను కొనడానికి ఏమేం చేశారని అతడిని అడిగినపుడు.. తన తల్లే ఆ డబ్బు ఇచ్చిందని చెప్పాడు. అతని తల్లితో మాట్లాడినపుడు.. తాను ఒక గుడిబయట పువ్వులు అమ్ముతానని, తన కొడుకు ఐ ఫోన్ కోసం 3 రోజులుగా ఏమీ తినలేదని, చివరికి తన పంతాన్నే నెగ్గించుకున్నాడని చెప్పుకొచ్చింది. వాళ్లిద్దరితో మాట్లాడిన వ్యక్తి ఐఫోన్ చేతికి ఇచ్చి.. ఓపెన్ చేయించాడు. గిఫ్ట్ గా ఒక బ్లూ టూత్ హెడ్ సెట్ ను ఇచ్చాడు.

ఓకే.. అంతా బానే ఉంది. కానీ.. కొందరు ఆ యువకుడిని తిడుతుంటే.. ఇంకొందరు తల్లిదండ్రులనే తప్పుపడుతున్నారు. తల్లిదండ్రుల అతి ప్రేమ పిల్లల్ని నాశనం చేస్తుందని, వారికి ఆశలకు కళ్లెం వేయాలని ఒక యూజర్ కామెంట్ చేశాడు. ఇంకొక యూజర్.. పువ్వుల వ్యాపారం చేసి జీవిస్తున్న తల్లిని ఇంతలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఆ తల్లి ఐ ఫోన్ ను కొనివ్వడానికి బదులుగా చెప్పులతో కొట్టి ఆకలికి అలమటించేలా చేసి ఉండాల్సిందని, స్వార్థపరులు తమ దురాశ కోసం తల్లిదండ్రుల్ని అమ్మేందుకు కూడా వెనుకాడరని కామెంట్ చేశారు. ఏది ఏమైనా.. పిల్లలకు స్తోమత లేకపోయినా ఇలాంటి విలువైన వస్తువులను కొనివ్వడం వారి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×