Pushpa 2 OTT: ఈరోజుల్లో చాలావరకు సినిమాలు థియేటర్లలో అంత మంచి టాక్ అందుకోకపోయినా.. ఓటీటీలో విడుదలయిన తర్వాత మాత్రం చాలామంది ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్నారు. ఒక సినిమాకు కాస్త మిక్స్‌డ్ టాక్ రాగానే దానిని థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడడం లేదు. ఓటీటీలో వచ్చేవరకు ఎదురుచూస్తున్నారు. అలా ఓటీటీలో విడుదలయిన సినిమాను చూసిన తర్వాత అంత నెగిటివ్‌గా ఏం లేదే అని కూడా మూవీ లవర్స్ ఫీలవుతున్నారు. గత కొన్నాళ్లుగా విడుదల అవుతున్న సినిమాలకు అదే జరిగింది. కానీ ‘పుష్ప 2’ విషయంలో మాత్రం అది రివర్స్ అయినట్టు అనిపిస్తోంది. ఇటీవల ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.
ఓటీటీలో అంతా రివర్స్
సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2’ మూవీ దేశవ్యాప్తంగా విపరీతమైన బజ్‌తో థియేటర్లలో విడుదలయ్యింది. ఈ సినిమా మొదటి భాగానికి, రెండో భాగానికి మూడేళ్లు గ్యాప్ తీసుకున్నారు మేకర్స్. అందుకే ‘పుష్ప 2’కు మొదట్లో పెద్దగా బజ్ లేదు. అయినా కూడా అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగి ప్రతీ రాష్ట్రానికి వెళ్లి ఈ మూవీ కోసం ప్రమోషన్స్ చేశారు. దీంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ప్రీమియర్ షో నుండే ‘పుష్ప 2’ను చూడడానికి భారీగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. సినిమా టాక్ ఎలా ఉన్నా.. చాలాకాలం పాటు థియేటర్లలో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యింది. కానీ ఓటీటీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఆసక్తి కనిపించడం లేదు
‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ పలు థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా 50 రోజుల రన్ పూర్తిచేసుకుంది. మిక్స్‌డ్ టాక్‌తోనే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించింది. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు విడుదల అవుతుండడంతో ‘పుష్ప 2’కు థియేటర్లకు తగ్గిపోయాయి. అయినా కూడా బన్నీ ఫ్యాన్స్ మాత్రం రెండు, మూడు సార్లు ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి ఆసక్తి చూపించారు. అలాంటిది ఓటీటీలో ఈ మూవీ విడుదల అయ్యిందనే విషయం కూడా చాలామంది తెలియదు. అయినా కూడా ఓటీటీలో విడుదల అవ్వగానే ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప 2’ ట్రెండ్ అవుతుందని మేకర్స్ ప్రకటన విడుదల చేశారు. ఏ మాత్రం బజ్ లేకుండా అలా ఎలా ట్రెండ్ అవుతుందని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: శ్రీతేజ్ కు మెమొరీ లాస్.. టెన్షన్ లో అల్లు అర్జున్…
వాటితో పోలిస్తే..
‘సలార్’, ‘దేవర’ లాంటి సినిమాలను కూడా థియేటర్లలో చాలామంది ప్రేక్షకులు చూశారు. అయినా కూడా అవి ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదరుచూశారు. కానీ ‘పుష్ప 2’ను చాలామంది ప్రేక్షకులు థియేటర్లలో చూసిన తర్వాత ఓటీటీలో చూడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. కలెక్షన్స్ విషయంలో ఒక రేంజ్ రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా.. వ్యూస్ విషయంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. అయినా కూడా మేకర్స్ మాత్రం ‘పుష్ప 2’ క్లైమాక్స్ సీన్‌కు ఫారిన్ ప్రేక్షకులు ఫిదా అయ్యారని అంటున్నారు. దానికి సంబంధించి అధికారికంగా పోస్టర్లు కూడా విడుదల చేశారు.
The RAMPAGE continues after setting the box office on FIRE ❤️🔥#Pushpa2TheRule TRENDING GLOBALLY on @NetflixIndia with humongous appreciation all over 💥💥#Pushpa2OnNetflix#Pushpa2#WildFirePushpa pic.twitter.com/8awt4jwARF
— Pushpa (@PushpaMovie) February 4, 2025