E-Paper
Advertisement

Minister Uttam: కేసీఆర్ చేసిన అప్పులు తీర్చడానికే ఏటా రూ.16 వేల కోట్లు కడుతున్నాం.. మంత్రి ఉత్తమ్ ఫైర్

Minister Uttam: కేసీఆర్ చేసిన అప్పులు తీర్చడానికే ఏటా రూ.16 వేల కోట్లు కడుతున్నాం.. మంత్రి ఉత్తమ్ ఫైర్
Advertisement

బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. హరీష్ రావు తన పేరు గోబెల్స్ అని మార్చి పెట్టుకోవాలని సూచించారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం విషయంలో పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. తెలంగాణ ప్రజల తలలు తాకట్టు పెట్టి కాళేశ్వరం కట్టారని… కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం కూలిపోయిందని అన్నారు మంత్రి ఉత్తమ్. దీంతో రాష్ట్రం సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ లీడర్లు ఈ విషయంలో సిగ్గుతో తలదించుకోవాలనీ.. రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తోన్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ కట్టించినవే అన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం ద్వారా గత ఐదేళ్లలో వాడిన నీళ్లు కేవలం 70 టీఎంసీలు మాత్రమేనని గుర్తు చేశారు మంత్రి ఉత్తమ్. హరీస్ రావు అతి తెలివి తేటలు ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు.

Advertisement

కృష్ణాజలాల విషయంలో.. 2014- 2020 వరకూ అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్ సంతకాలు పెట్టినట్టు చెప్పారు మంత్రి ఉత్తమ్. పాలమూరు, డిండి, SLBC కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ చేసిన అప్పులు తీర్చడానికే ఏటా రూ. 16 వేల కోట్లు కడుతున్నట్టు వివరించారు. 45 టీఎంసీల లేఖ ఏమంత కొత్తది కాదనీ.. బీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందాన్నే తాము లేఖ రూపంలో రాసినట్టు చెప్పారు.

90 టీఎంసీలను గతంలో కేసీఆరే డివైడ్ చేసిన 45 టీఎంసీలుగా మార్చినట్టు గుర్తు చేశారు మంత్రి ఉత్తమ్. పాలమూరుకు ఇప్పటికీ పర్యావరణ అనుమతులు రాలేదనీ.. పదేళ్ల పాటు పాలమూరు పూర్తి చేయకుండా ఇక్కడి వారిని మోసం చేశారనీ.. ఈ ప్రాజెక్టు 90 శాతం పూర్తయితే.. ఇప్పటి వరకూ ఒక్క ఎకరాకు నీరెందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు ఉత్తమ్. వీళ్లు ప్రాజెక్టులు కట్టారని చెప్పడం కన్నా.. డబ్బు దండుకోవడం మీదే ఎక్కువగా దృష్టి సారించారనీ.. అందుకే 38 వేల కోట్ల ప్రాజెక్టు, కమిషన్ల కోసం లక్షన్నర కోట్ల వరకూ తెచ్చినట్టు ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Advertisement

ALSO READ: Kavitha: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేం పోటీ చేస్తున్నాం.. కవిత కీలక వ్యాఖ్యలు

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×