E-Paper
Advertisement

అడ్రస్ లేని ఆఫీస్.. అల్లాడుతున్న రైతులు.. సైదాపూర్ ఇరిగేషన్ శాఖ ఎక్కడో..?

అడ్రస్ లేని ఆఫీస్.. అల్లాడుతున్న రైతులు.. సైదాపూర్ ఇరిగేషన్ శాఖ ఎక్కడో..?
Advertisement

Irrigation Office: స్వేచ్ఛ బ్యూరో: అది సైదాపూర్ మండల రైతాంగానికి సాగునీటి భరోసా ఇవ్వాల్సిన కార్యాలయం. కానీ ఆ కార్యాలయం ఎక్కడుందో, ఏ ఊళ్లో ఉందో తెలియక రైతులు అల్లాడిపోతున్నారు. మండల కేంద్రంలో ఉండాల్సిన ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయం ఆచూకీ లేకపోవడంతో, సామాన్య రైతులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సమస్య ఏదైనా వస్తే జిల్లా కేంద్రమైన కరీంనగర్ దాకా పరుగులు తీయాల్సి వస్తోందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అడ్రస్ లేని కార్యాలయం.. అవస్థల్లో రైతులు..

సైదాపూర్ మండలానికి సంబంధించి సాగునీటి వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయం నిబంధనల ప్రకారం స్థానికంగానే ఉండాలి. అయితే, క్షేత్రస్థాయిలో రైతులకు ఆ కార్యాలయం గానీ, దానికి సంబంధించిన అధికారులు గానీ కనిపించడం లేదు. సాగునీటి విడుదల, కాల్వల మరమ్మతులు లేదా ఇతర సమస్యలపై వినతిపత్రం ఇవ్వాలన్నా అధికారుల ఆచూకీ దొరకడం లేదు. దీంతో చేసేదేమీ లేక రైతులు నేరుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎల్.ఎం.డి (LMD) కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. కనీసం సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరాలన్నా మండలంలో వీలు పడకపోవడం గమనార్హం.

Advertisement

Also read: రెండు సీట్లలో దూసుకుపోతున్న విజయ్, అదే జరిగితే రంగంలోకి త్రిష, అర గంటపాటు ఇంట్లో చర్చలు

జిల్లా కలెక్టర్‌కు విన్నవించేందుకు సిద్ధం

స్థానికంగా అధికారులు అందుబాటులో లేకపోవడంతో, సైదాపూర్ మండల రైతులు నేరుగా జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. తమ సమస్యలను విన్నవించుకునేందుకు సుదూర ప్రాంతం నుంచి కరీంనగర్ వెళ్లాల్సి వస్తోందని, అక్కడి నుంచి విచారణ జరిగి ఆదేశాలు వచ్చేసరికి కాలయాపన జరుగుతోందని వాపోతున్నారు. ఈ జాప్యం వల్ల పంటలు ఎండిపోయి తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మండల ఇరిగేషన్ ఆఫీస్ ఎక్కడుందో మాకు తెలియదు. అధికారులు ఎవరో అస్సలే తెలియదు. ఏ చిన్న పని కావాలన్నా కరీంనగర్ వెళ్లలేక చస్తున్నాం. కలెక్టర్ గారైనా కనికరించి మా ఆఫీసును వెతికించి, మాకు అందుబాటులోకి తీసుకురావాలి.

సన్నగిల్లుతున్న సహనం

Advertisement

ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు సాగునీటి ఇబ్బందులతో సతమతమవుతున్న రైతులకు ఈ కార్యాలయాల వేట అదనపు భారంగా మారింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, సైదాపూర్ ఇరిగేషన్ సబ్ డివిజన్ ఆఫీసును తక్షణమే మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వీడి, తమ గోడు వినాలని రైతాంగం గట్టిగా కోరుతోంది.

Also read: పాలమూరు గడ్డపై కవిత గర్జన.. కృష్ణా జలాల సాధనకు భారీ బహిరంగ సభ!

Related News

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×