BigTV English

SI Suspend: మహిళతో అసభ్య ప్రవర్తన.. మియాపూర్ ఎస్సై సస్పెండ్..

SI Suspend: మహిళతో అసభ్య ప్రవర్తన.. మియాపూర్ ఎస్సై సస్పెండ్..
Today news in telangana

SI Suspend(Today news in telangana):

హైదరాబాద్‌ మియాపూర్‌ పీఎస్ ఎస్సై గిరీష్‌కుమార్‌ ఓ కేసులో బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించారన్న కారణంగా సస్పెన్షన్ వేటు వేశారు. ఎస్సై గిరీష్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి మంగళవారం ఆదేశాలిచ్చారు. 2020 బ్యాచ్‌కు చెందిన ఎస్సై గిరీష్‌కుమార్‌ మియాపూర్‌ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్నాడు.


బ్యూటీ పార్లర్ నడుపుతున్న ఓ మహిళ.. చీటింగ్‌ కేసు విషయమై మియాపూర్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన స్నేహితుడు వ్యాపారం పేరుతో సుమారు రూ.6 లక్షలు మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సై గిరీష్ ఫిర్యాదును పరిశీలించి.. సదరు వ్యక్తిని విచారణకు పిలిపించారు. అతని నుంచి డబ్బు రికవరీ చేయించారు. అప్పటికే కేసు ముగిసినా.. ఎస్సై సదరు మహిళ ఫోన్‌ నంబరు తీసుకుని వెంటపడ్డాడు. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు నేరుగా సీపీకి ఫిర్యాదు చేసింది. పోలీసు విచారణలో అది నిజమని తేలింది. దీంతో ఎస్సైను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.


Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×