Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2025 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో 14 ఏళ్ల భారత కుర్రాడు అద్భుతమైన సెంచరీ సాధించి అందరి మన్ననలు పొందాడు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఆటగాళ్లలో ఇతను ముందు వరుసలో ఉంటాడు. అలాగే అత్యంత తక్కువ వయస్సుల్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో అందరి కంటే కూడా సూర్యవంశీ ముందంజలో ఉంటాడు. ప్రస్తుతం ఇతని గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏంటంటే..? కారు గెలిచినా.. వైభవ్ సూర్యవంశీ మరో నాలుగేళ్ల పాటు దానిని డ్రైవ్ చేయలేడు. ఎందుకు అంటే..? భారతదేశంలో ఆర్టీఏ రూల్స్ ప్రకారం.. డ్రైవింగ్ వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. ఇప్పుడు వైభవ్ నడపడానికి ఇంకా నాలుగేళ్ల పాటు వేచి ఉండాల్సిందే మరీ. ఈ విషయం పై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్స్ చేయడం విశేషం.
Also Read : Virat Kohli – Anushka: 11 మంది మృతి..18 గంటలు కాకముందే దేశం వదిలి పారిపోతున్న కోహ్లీ ?
అయినప్పటికీ.. అతి చిన్న వయస్సులోనే ఐపీఎల్ లో అతను ఆడిన ఆటతీరు.. సాధించిన రివార్డు అతని భవిష్యత్ పై భారీ ఆశలను పెంచుతున్నాయి. వైభవ్ కి ఇది ప్రారంభమే.. అంటూ అతని క్రికెట్ ప్రయాణంలో ముందు ముందు మరెన్నో మైలురాళ్లను దాటుతాడని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు . ముఖ్యంగా ఐపీఎల్ 2025 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడిన ఈ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్బుతమైన ప్రదర్శనతో అందరినీ ఆటకట్టుకున్నాడు. 14 ఏళ్ల వయస్సులోనే తన మొదటి ఐపీఎల్ సీజన్ లో తనదైన ముద్ర వేస్తూ.,. గుర్తింపు పొందాడు. అతను ఆడిన మ్యాచ్ ల్లో 252 పరుగులు చేసి.. స్ట్రైక్ రేట్ 206.55 తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన కి గుర్తింపు గా ఐపీఎల్ నిర్వాహకులు అతన్ని సూపర్ స్టైకర్ ఆఫ్ ది సీజన్ గా పేర్కొంటూ బహుమతిగా కారుని అందజేసారు.
అక్కడే ఇక అసలు ట్విస్ట్ చేసుకోవడం విశేషం. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఊచకోత కోసి, ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు వైభవ్ సూర్యవంశీ. తన మూడో ఐపీఎల్ మ్యాచ్‌లో వైభవ్ ఈ ఘనత సాధించడం గమనార్హం. అతను కేవలం 35 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో, ఈ బ్యాటర్ 7 ఫోర్లు, 11 సిక్సర్లు కొట్టాడు. వైభవ్ తన సెంచరీతో ఎన్నో రికార్డులను సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా, అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా అతను నిలిచాడు. అదే సమయంలో టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. “ఐపీఎల్‌లో సెంచరీ సాధించడం ఒక కల లాంటిది. ఈరోజు నేను దానిని సాధించాను. నాకు భయం లేదు. నేను పెద్దగా ఆలోచించను. నా దృష్టి అంతా ఆడటం మీదే ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.