BigTV English

Mla Mallareddy secret reveals: మల్లరెడ్డి సీక్రెట్ రివీల్, ఆ క్రెడిట్ అంతా నాదే, కాకపోతే..

Mla Mallareddy secret reveals: మల్లరెడ్డి సీక్రెట్ రివీల్, ఆ క్రెడిట్ అంతా నాదే, కాకపోతే..

Mla Mallareddy secret reveals: మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. నిజాన్ని నిర్భయంగా చెప్పడం ఆయన నైజం. మిగతావాళ్లు ఏమనుకున్నా ఆయన పెద్దగా పట్టించుకోరు. మాట్లాడిన ప్రతీ పదం వెనుక ఆయన నవ్వడం చాలామందికి అనుమానాలుంటాయి. నిజంగా అంటున్నారా? లేక కావాలనే అంటున్నారా? లేకపోతే జోష్ నింపాలని భావిస్తారా? ఇలా రకరకాల అనుమానాలు లేకపోలేదు. కాకపోతే సోషల్ మీడియాలో ట్రెండ్ అయితేనే ఆయన నోరు విప్పుతారు. మామూలుగా నిత్యం వార్తల్లోకి ఉండేందు కు పరితపిస్తారాయన.


అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలామంది నేతలు కారు దిగిపోయారు. మారిన రాజకీయాలకు అనుగుణంగా వెళ్లకుంటే తమకు లైఫ్ ఉండదని భావించి జంప్ అయిపోతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు కూడా కాంగ్రెస్, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు జిల్లాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సెలర్ల వంతైంది. దాదాపుగా కారు పార్టీ వీకైందని షెడ్‌కి వెళ్లిందని ఆ పార్టీ నేతలే బలంగా చెబుతున్నారు.

బీఆర్ఎస్‌లో ముఖ్యనేతల వ్యవహారశైలి వల్లే కారణమని దుమ్మెత్తిపోస్తున్నవాళ్లూ లేకపోలేదు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.. బీఆర్ఎస్ నుంచి చాలామంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోకి తానే పంపించానని ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసేసుకున్నారు. అంతేకాదు కాంగ్రెస్‌లో ఉంటూ కారు కోసం కష్టపడతారని మనసులోని మాటను బయటపెట్టారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.


విచిత్రం ఏంటంటే పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారాయన. మల్లన్న మాటలపై ఆ పార్టీలోని నేతలే రుసరుసలాడుతున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఎవరైనా అందులో ఉంటారా? ఈ లాజిక్‌ను మాజీ మంత్రి ఎలా మరిచిపోయారని అంటున్నారు. ఏదో కార్యకర్తల్లో హుషారు కోసం అలాగని చెప్పి ఉంటారని చెబుతున్నారు.

ఇంకా నయం.. రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా తానే పంపించానని మల్లారెడ్డి అనలేదని అంటున్నారు పలువురు నేతలు. మొత్తానికి మల్లారెడ్డి వ్యాఖ్యలు విన్నవాళ్లు మాత్రం ఖుషీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో సరదాగా అన్నమాటలు కూడా ఒక్కోసారి మెడకు చుట్టుకుంటాయని పెద్దాయనకు బాగా తెలుసు. కాకపోతే మాటలతో మాయం చేయడం వెన్నతోపెట్టిన విద్య.

Tags

Related News

KTR: తెలంగాణ ప్రజలపై రూ.15వేల కోట్ల భారం.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. నార్శింగ్-హిమాయత్‌‌సాగర్ సర్వీస్ రోడ్డు క్లోజ్..

Weather News: మరో రెండు రోజుల భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, బయటకు వెళ్తే అంతే సంగతులు

BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు.. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ

Hyderabad Musi River: మూసీ నదికి పోటెత్తిన వరద.. మునిగిన హైదరాబాద్.. హై అలర్ట్!

BRS KTR: నన్ను ఇప్పుడంటే ఇప్పుడు అరెస్ట్ చేసుకోండి.. నేను దేనికైనా రెడీ: కేటీఆర్

ED raids Hyderabad: లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు.. బసరత్ ఖాన్ ఇంట్లో ఈడీ సోదాలు

TG Dasara Holidays: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజీలకు దసరా సెలవులు, ఎప్పటినుంచంటే?

Big Stories

×