BigTV English

MLA Prem Sagar Rao : మందుతాగే అలవాటుందా? మీకు టికెట్ కట్టే: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

MLA Prem Sagar Rao : మందుతాగే అలవాటుందా? మీకు టికెట్ కట్టే: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

Mla Prem Sagar rao sensational comments On tickets Local Bodies Elections :  మీకు మందు తాగే అలవాటు ఉందా. అయితే మీకు టిక్కెట్ లేదు పోండి. ఈ మాటలు అన్నది సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే. అదీ అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు.


మద్యపానం చేసే వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు, పదవులు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు గాంధీ జయంతిని పురస్కరించుకుని నియోజకవర్గం పరిధిలోని దండేపల్లిలో మద్యం మానేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. తాము ఇకపై మందు తాగమని, మాదకద్రవ్యాలు జోలికి వెళ్లమని ప్రమాణం చేశారు.

జాతిపిత మహాత్మా గాంధీజీ కలలు కన్న స్వరాజ్యాన్ని సాకారం చేసేందుకే కాంగ్రెస్ శ్రేణులు మద్యానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రతిజ్ఞను అంతా నిలబెట్టుకోవాలని, ఉల్లంఘిస్తే మాత్రం రానున్న స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు వారికి టిక్కెట్లు నిరాకరిస్తామన్నారు.


పార్టీ తరఫున సైతం ఎలాంటి పదవులు కట్టబెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇక ప్రతిజ్ఞ చేసిన నేతలు నలుగురి కోసం ఆదర్శప్రాయమైన జీవితం గడుపుతామన్నారు. కుటుంబానికి, సమాజానికి పేరు తీసుకోస్తామని, నియోజకవర్గంలో కుల మత కలహాలు, కక్షలు, గొడవలు, వర్గ విభేదాలు లేకుండా ప్రశాంత వాతావరణాన్ని పెంపొందిస్తామన్నారు.

Related News

Kukatpally Nallacheruvu: ముక్కు మూసుకొనే చెరువు.. రూపం మార్చుకుంది.. రమ్మని అంటోంది!

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా హర్పాల్ సింగ్.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Job guarantee courses: ఇంటర్, డిగ్రీ అవసరం లేదు.. పదో తరగతి తర్వాతే డైరెక్ట్ జాబ్.. ఇలా చేయండి!

Govt savings plan: మీ పాప పేరు మీద ఈ స్కీమ్‌లో ఇంత పెట్టుబడి పెడితే.. పెళ్లికి సుమారు రూ.72 లక్షలు మీ చేతికి!

TG High Court: రామంతాపూర్ ఘటనపై హైకోర్టు సీరియస్.. నివేదక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం

Kaleshwaram Report: కాళేశ్వరం నివేదికపై పిటిషన్.. కోర్టులో వాడివేడి వాదనలు, తీర్పు ఎటు?

Big Stories

×