BigTV English

MLA RohitReddy: గన్‌మెన్లతో వీడియో షూట్.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఓవరాక్షన్!

MLA RohitReddy: గన్‌మెన్లతో వీడియో షూట్.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఓవరాక్షన్!
mla rohit reddy

MLA Pilot Rohit Reddy(Political news today telangana): మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డినే కింగ్ పిన్. ఆ కేసు అంతా ఆయన చుట్టూనే తిరిగింది. ఆయన ఫామ్‌హౌజ్‌లో.. ఆయన తరఫునే నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారు. సీసీకెమెరాల సాక్షిగా అడ్డంగా బుక్కయ్యారు మధ్యవర్తులు. ఆ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీ బిగ్ లీడర్ బీఎల్ సంతోష్ వరకూ సిట్ విచారణ సాగింది. కోర్టు తీర్పుతో కేసుకు స్పీడ్ బ్రేకులు పడ్డాయి. ఆ కేసు తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రాణాలకు హాని ఉందంటూ.. రాష్ట్ర ప్రభుత్వం భారీగా భద్రత పెంచింది. ఏకంగా వై-కేటగిరీ సెక్యూరిటీ కల్పించింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా.. ఫుల్ టైట్ సెక్యూరిటీనే. గన్‌మెన్ల హడావుడినే.


కట్ చేస్తే.. ఈ డిగ్నిఫైడ్ వ్యవహారాన్ని చీప్ ప్రమోషన్‌కు వాడేసుకున్నారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి. లేటెస్ట్‌గా ఓ యాగం నిర్వహించారు ఆయన. కాషాయ వస్త్రాలు కట్టుకొని.. నుదిట బొట్టు పెట్టుకున్నారు. ఏదో భక్తితో చేసిన పూజల వరకే ఆగిపోకుండా.. మరింత ఓవరాక్షన్ చేశారు. కాషాయ బట్టలతో.. చుట్టూ గన్‌మెన్లతో.. నడిచొస్తూ.. వీడియో షూట్ చేయించుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల కోసం ప్రభుత్వ సెక్యూరిటీతో బిల్డప్ వీడియో తీయించుకున్నారు.

ఆయనేదో వీడియో తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ, ఆ వీడియో కోసం గవర్నమెంట్ గన్‌మెన్లను వాడుకోవడమే కాంట్రవర్సీ అవుతోంది. ఏదో సినిమా హీరోలా.. ఈయన మధ్యలో నడిచొస్తూ.. అటూఇటూ రెండు వరుసల్లో తుపాకులు పట్టుకున్న పోలీసులు ఆయన్ను అనుసరిస్తూ.. అచ్చం సినిమా షూటింగ్ మాదిరి వీడియో షూట్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో.. ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.


మరోవైపు.. వికారాబాద్ జిల్లా తాండూరులో బీఆర్ఎఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న యాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన యాగం దగ్గర నిప్పురవ్వలు ఎగిరి పడడంతో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×