
MohanBabu: తరుచూ నోటి దురుసుతనం ప్రదర్శించే వెటరన్ హీరో మోహన్ బాబు.. మరోసారి అదే తీరును కనబరిచారు. షాద్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు మీడియాపై హీరో మోహన్ బాబు చిందులు వేశారు. బుద్ధి లేదా అంటూ మీడియాపై నోరు పారేసుకున్నారు. లోగోలు లాక్కోండి అంటూ తన బౌన్సర్లకు సూచించారు.
ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మోహన్ బాబు స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. ఆయన వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్‌కు వెళ్లగా.. వారిపై ఆగ్రహం ప్రదర్శించారు. కొందరు మోహన్ బాబు అంతేలే అని లైట్ తీసుకుంటుండగా.. ఆయన మారరు అని మరికొందరు విసుక్కుంటున్నారు. ఎంతైనా మంచు ఫ్యామిలీనా మాజాకా..అంటున్నారు.
Rahul Gandhi: వాళ్లు కాంగ్రెస్ ని వీడాలన్న రాహుల్.. ఎందుకంటే..?