BigTV English

Vemula Veeresham: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న తెలంగాణ ఎమ్మెల్యే

Vemula Veeresham: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న తెలంగాణ ఎమ్మెల్యే

Vemula Veeresham: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఏకంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్ చేశారు. ఆయన సోసల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ నుంచి ఫొటోలు సేకరించిన కేటుగాళ్లు.. వాటిని మార్ఫింగ్‌ చేసి న్యూడ్ కాల్స్ చేసినట్టు వీడియో తయారు చేశారు. ఆ వీడియోను వాట్సాప్ ద్వారా ఎమ్మెల్యే వీరేశంకు పంపి, డబ్బులు డిమాండ్ చేశారు. లేదంటే వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ బ్లాక్‌మెయిల్‌ చేశారు. దాంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.


వివరాల్లోకి వెళ్తే.. నకిరేల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంను సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. దీంతో ఆయన కాల్ లిఫ్ట్ చేయడంతో.. అవతలి వ్యక్తి నగ్నంగా కాల్ మాట్లాడారు. ఇంతలో కేటుగాళ్లు స్క్రీన్ రికార్డు చేసి మళ్లీ ఆయనకే పంపారు.. వీడియో విషయంపై బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. ఆయన స్పందించక పోవడంతో ఆ వీడియోను సదరు కాంగ్రెస్ నేతలకు పంపారు.

ఈ నేపథ్యంలో సదరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వీరేశంకు ఫోన్ చేయడంతో ఖంగుతిన్నారు. దీంతో నేరగాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


ఇదిలా ఉంటే.. సైబర్ క్రైమ్.. ఈ పేరు వింటేనే వణుకుపుడుతోంది. పెరుగిపోతున్న సాంకేతికతను మోసగాళ్లు ఆసరాగా తీసుకుని అందిన కాడకి డబ్బులు దండుకుంటున్నారు. సులభంగా మనీ సంపాదించడంపై ఫోకస్ చేయడమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. గతంలో చోరీలు అంటే ఇంటి కిటికీలు, తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న డబ్బును దొంగిలించేవారు. కానీ ఇప్పుడు కంప్యూటర్ల ముందు కూర్చొని కూడా కన్నాల వేయవచ్చని నిరూపిస్తున్నారు. అయితే కన్నం మీ ఇంటికి కాదు.. మీకు, మీ బ్యాంకు ఖాతాకు.

Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు.. ఒకరు అమెరికా, మరొకరు బెల్జియంకు పరార్

గతంలో ఈ మోసాలా భారినపడిన వారిలో యువకులు, మహిళలు ఉంటే.. ఇప్పుడు రాజకీయ నాయకులు, వృద్ధులు కూడా ఈ కోవకే వచ్చేశారు. అసలు సైబర్ మోసం లేని రోజు లేదు అన్నట్లు కాలం మారిపోయింది. మరి ఇందుకు గల కారణాలు ఏంటి..? మోసపోకుండా ఉండాలంటే ప్రజలు ఏవిధంగా అవగాహన చెందాలి. కాస్త కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటమే అర్హత. నాలుగు ముక్కలు మాట్లాడి బురిడీ కొట్టించగలిగితే అదే ఆయుధం. ఇదీ సైబర్ నేరస్థులు అనుసరిస్తున్న పంథా.. మొన్నటి వరకు వివధ దేశాలు నగరాలకే పరిమితమైన కేటుగాళ్లు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు, పల్లెలు, తండాలకు కూడా విస్తరించారు. ఏమరుపాటుగా ఉన్నారో సర్వ నాశనమే. ఏదైనా  గుర్తు తెలియని నెంబర్‌తో మెసేజ్ కానీ, ఫోన్ కానీ వస్తే లిఫ్ట్ చేయకండి.. చేశారో.. డేంజర్‌లో పడ్డట్టే.. మీ ముబైల్‌లో డేటా మొత్తం వాళ్ల చేతికి వెళ్లిపోతుంది. ఇక న్యూడ్ వీడియోలు, మెసేజ్‌లతో డబ్బులు కోసం బెదిరించే ఛాన్స్ ఉంది. ఇలాంటివి ఏమైనా వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.

 

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×