BigTV English

MLC kavitha – Harish Rao: సిద్దిపేటపై కవిత ఫోకస్? పెద్ద ప్లానే!

MLC kavitha – Harish Rao: సిద్దిపేటపై కవిత ఫోకస్? పెద్ద ప్లానే!

MLC kavitha – Harish Rao: బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ఎవరికీ అంతుపట్టడం లేదని టాక్. మీడియా ముందు కలివిడి మాటలు.. ఆ తర్వాత పట్టింపులు ఇది బీఆర్ఎస్ లీడర్స్ తీరంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి పరిస్థితులతోనే బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలిందని, మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోందని ప్రచారం సాగుతోంది. అందుకు కారణం ఇటీవల ఎమ్మెల్సీ కవిత, సిద్దిపేటపై ఫోకస్ చేయడమేనట. కవిత సిద్దిపేటపై దృష్టి సారించగా, హరీష్ రావు అభిమానులు మాత్రం ఏ క్యాహై అంటూ.. నిట్టూరుస్తున్నారట. ఇంతకు కవిత నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది ఎవరికీ అంతుబట్టడం లేదని ప్రచారం సాగుతోంది.


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కవిత జైలు నుండి బెయిల్ పై బయటకు వచ్చారు. కొద్దిరోజులు పార్టీ స్థితిగతులు అంచనా వేసిన కవిత, ఆ తర్వాత స్పీడ్ పెంచారు. కవితకు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో స్పెషల్ క్రేజ్ ఉంది. పార్టీ క్యాడర్ కూడా ఆమెకిచ్చే గౌరవంలో ఏమాత్రం తక్కువ చేయరు. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టడంలో ఎవరైనా కవిత తర్వాతే అంటారు పార్టీ క్యాడర్. అయితే ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలను బట్టి కవిత.. కాస్త బీఆర్ఎస్ అధినాయకత్వానికి భిన్నంగా నడుచుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. పలు విషయాలతో విభేదిస్తూ.. తన పని తాను కవిత చేసుకుపోతున్నారట.

ఇటీవల శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాకౌట్ చేసినప్పటికీ కవిత మాత్రం సభలో ఉండిపోయారు. అంతేకాదు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్ పాల్గొనలేదు. కవిత మాత్రం సర్వేలో పాల్గొని తన వివరాలు అందజేశారు. దీనితో మంత్రులు కూడా కవిత సర్వేలో పాల్గొంది.. మీకేమైంది అంటూ కేటీఆర్, కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఇలా కొన్ని అంశాలలో కవిత తనకంటూ ప్రత్యేకత చాటుకుంటూ.. తనకు ఉన్న ఇమేజ్ ను పెంచుకుంటూ పోతున్నారని టాక్.


కాగా ఇటీవల సిద్దిపేటపై కవిత ఫోకస్ పెట్టారని బీఆర్ఎస్ క్యాడర్ భావిస్తోంది. సిద్దిపేట నుండి మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. హరీష్ స్వయాన వరుసకు కవితకు బావ అవుతారు. కేసీఆర్ కుటుంబానికి సమీప బంధువైన హరీష్ రావుకు, కేటీఆర్, కవితలకు మనస్పర్థలు ఉన్నాయని పలుమార్లు వదంతులు వ్యాపించాయి. ఇలాంటి తరుణంలో కవిత ఇటీవల స్పీడ్ పెంచి ఎక్కువగా సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పార్టీలో తనకంటూ బ్రాండ్ ఇమేజ్ ఉన్న కవిత కన్ను సిద్దిపేటపై పడిందని, రానున్న ఎన్నికల్లో కవిత పోటీ ఇక్కడి నుండే అంటూ ప్రచారం సాగుతోంది.

Also Read: Chittoor News: పదవ తరగతి విద్యార్థినికి గర్భం.. బిడ్డకు జన్మనిచ్చి మృత్యు ఒడికి..

అలాగే జగిత్యాల నుండి పోటీ చేస్తారని కూడా మరో ప్రచారం సాగుతోంది. కానీ హరీష్ రావుకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే సిద్దిపేటలో కవిత తరచూ పర్యటిస్తున్నారని, రానున్న ఎన్నికలకు ఇప్పటినుండే రూట్ వేస్తున్నట్లు కొందరి అభిప్రాయం. అదే నిజమైతే హరీష్ రావు నెక్స్ట్ పోటీ ఎక్కడి నుండి సాగుతుందనే కోణంలో కూడా చర్చలు సాగుతున్నాయి. మొత్తం మీద మీడియా ముందు మేమంతా ఒకటే అనే నినాదం అంటూ వీరు ప్రచారం సాగిస్తున్నప్పటికీ, విభేదాలు ఉన్నాయ్.. అందుకే సిద్దిపేటపై కవిత ఫోకస్ అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ ప్రచారంలో ఎంత మేరకు వాస్తవం ఉందో కానీ, మొత్తం మీద కవిత దెబ్బకు హరీష్ రావు అనుచరులు ఏ క్యాహై అనేస్తున్నారట.

Related News

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

TG Number Plates: ఇకపై ఆ వాహనాలపై ‘తెలంగాణ పోలీస్’ స్టిక్కర్లు.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు

Union Bank Manager Fraud: 10 నకిలీ గోల్డ్ లోన్ అకౌంట్స్.. రూ.75 లక్షలు.. బయటపడ్డ యూనియన్ బ్యాంకు మేనేజర్ బాగోతం

Hyderabad News: అడ్డంగా దొరికిపోయిన కేఏ పాల్‌.. పోలీసుల చేతుల్లో ఆయన గుట్టు

Hyderabad: ఘనంగా సెలబ్రిటీ డాండియా నైట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Big Stories

×