Train Cancelled List: భక్తుల రద్దీ, కుంభమేళాకు లక్షల భక్తులు తరలిరాడం పలు కారణాల వల్ల రైళ్ల రాకపోక నిలిచిపోయాయి. చాలా రైళ్లు వాటి షెడ్యూల్ సమయం కంటే ఆలస్యంగా గమ్యాన్ని చేరుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బాలమౌ స్టేషన్‌లో నిన్న 13 అప్-డౌన్ రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దీని కారణంగా, నిన్న బరేలీ జంక్షన్‌లో ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే, ఫిబ్రవరి 19 వరకు ఈ రైలు రాకపోకలు నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. రైళ్ల రద్దు కారణంగా ప్రయాణికులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న 412 మంది తమ టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకున్నారు.
రద్దు అయిన రైళ్లు ఇవే..
బరేలీ ఢిల్లీ, రాజ్యరాణి, వందేభారత్, గంగాసట్లేజ్, పంజాబ్ మెయిల్, జంతా, జమ్ముతావి, జనసేవ, డబుల్ డెక్కర్, మాల్దా టౌన్, రాజ్యరాణి, వారణాసి ఎక్స్‌ప్రెస్, కాశీ విశ్వనాథ్ రైళ్లు రద్దు అయ్యాయి.
గంటల తరబడి రైళ్లు ఆలస్యం..
సహర్సా స్పెషల్ సాయంత్రం 4.10 గంటలకు నాలుగు గంటలు ఆలస్యంగా రాగా, శక్తినగర్ త్రివేణి గంటన్నర, కుంభ్ స్పెషల్ 4:30 గంటలు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకున్నాయి. త్రివేణి ఎక్స్‌ప్రెస్ అరగంట ఆలస్యంగా వచ్చింది. అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్ కూడా షెడ్యూల్ చేసిన సమయం కంటే ఆలస్యంగా వచ్చింది.
మూడు ప్రత్యేక రైళ్లు..
కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా కుంభమేళా కోసం నార్తర్న్ రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడిపింది. ఈ రెండు ప్రత్యేక రైళ్లు ఘజియాబాద్, మొరాదాబాద్, బరేలీ, లక్నో, రాయ్ బరేలి మీదుగా ఫాఫమౌ చేరుకుంటాయి. ఢిల్లీ సీపీఆర్‌ఓ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ కుంభమేళా స్పెషల్ గురించి తెలియజేశారు.
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఎం, ఎస్పీ..
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో చాలా మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కారణంగా, రైల్వే బోర్డు పలు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఉత్తర్వును దృష్టిలో ఉంచుకుని, డీఎం, ఎస్పీ సిటీ జంక్షన్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రైల్వే సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు.
శని, ఆదివారాల్లో రైళ్ల రద్దీ కారణంగా.. ప్రయాణికులు వేరే మార్గాలు ప్రయాగరాజ్‌కు వెళ్లారు. రైల్వే స్టేషన్లలో పెరుగుతోన్న అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాగరాజ్ కు వెళ్లేందుకు 16 అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ AC బస్సులను నడపాల్సి వచ్చింది. అయినప్పటికీ, చాలా మంది ప్రయాణికులు బస్సులో నిలబడి ప్రయాణించారు. 52 సీట్ల బస్సులో 70 నుండి 75 మంది ప్రయాణికులు ప్రయాణం చేశారు.
ఉద్యోగులకు మామూలుగా శని, ఆది వారాల్లో సెలవు ఉండడంతో ఆ సమయంలో కుంభమేళాకు పోటెత్తుతున్నారని రవాణా సంస్థ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం అధికారులు త్రివేణి ఎక్స్‌ప్రెస్ రద్దు చేశారు. మొఘల్‌సరాయ్ ఎక్స్‌ప్రెస్ తొమ్మిది గంటలకు పైగా ఆలస్యంగా వచ్చింది. రాత్రి 12 గంటల వరకు ప్లాట్‌ఫామ్ కు చేరుకోలేకపోయింది. అలాంటి పరిస్థితిలో, ప్రయాణికులు తమ టిక్కెట్లను తిరిగి ఇచ్చారు. అర్ధరాత్రి, ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తుల వేరే మార్గాలను చూసుకున్నారు. అయితే బస్సుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తోసుకుంటూ బస్సుల్లోకి ఎక్కారు. కొన్ని బస్సుల్లో భక్తుల మధ్య గొడవ కూడా జరిగింది.
ALSO READ: NTPC Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే ఎనఫ్..
వెంటనే సంఘటనా స్థలానికి ఏఆర్ఎం బరెలీ డిపో సంజీవ్ శ్రీవాస్తవ, ఏఆర్ఎం రోహిల్ ఖండ్ డిపో అరుణ్ కుమార్ బాజ్ పాయ్ వచ్చారు. వర్క్ షాప్ నుంచి అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. భక్తలను ప్రయాగ్ రాజ్ కు తీసుకెళ్లెందకు అదనంగా 16 బస్సులను ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ ఏసీ బస్సులు అందుబాటులోకి తెచ్చారు. అప్పుడు కాస్త రద్దీ తగ్గింది. ప్రతి బస్సులో 70 నుండి 75 మంది ప్రయాణికులు వెళ్లారు. నిన్న రోజంతా భక్తులు తరలిరావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. రవాణా సంస్థ యాజమాన్యం అర్థరాత్రి వరకు 12 అదనపు బస్సులను నడపాల్సి వచ్చింది. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌కు 13 బస్సులను క్రమం తప్పకుండా బస్సులు నడుస్తున్నాయి.