MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత సొంతపార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టేనన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆర్డినెన్స్ వద్దని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా తన దారికి రావాల్సిందేనన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఆర్డినెన్స్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
గురువారం ఉదయం తన నివాసంలో మీడియాతో చిట్ చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు కవిత. బీసీల రిజర్వేషన్లపై రెండు బిల్లులు పెట్టాలని తొలుత డిమాండ్ చేసింది తానేనని గుర్తు చేశారు.ఇందుకోసం నాలుగు రోజులు సమయంలో తీసుకుంటారేమోనని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబేనన్నారు.
ఈ విషయంలో రేవంత్ సర్కార్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపిన సమావేశం పండగలా కనిపించిందన్నారు. మొదట బనకచర్ల అంశంపైనే చర్చ జరిగిందన్నారు. బనకచర్లను తక్షణమే ఆపాలని లేదంటే జాగృతి న్యాయ పోరాటం చేస్తుందన్నారు.
బీసీ రిజర్వేషన్లు, బనకచర్లపై సీఎం రేవంత్‌రెడ్డి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన ఆరోపణలను తమ పార్టీ బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
ALSO READ: స్థానిక సంస్థలకు అంతా రెడీ, మరో రెండు వారాల్లో నోటిఫికేషన్
కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీలో అగ్రనేతలు షాకయ్యారు. కవిత ఆ తరహా వ్యాఖ్యలు చేయడమేంటని అప్పుడే ఆ పార్టీ నేతల్లో చిన్నపాటి చర్చ మొదలైంది. ఆమె ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని అంటున్నారు. దీనివల్ల పార్టీకి నష్టం తప్పదన్నది ఓ వర్గం ఆలోచన. కుటుంబ సభ్యుడికి న్యాయం చేయని పార్టీ, ఇక ప్రజలు ఏం చేస్తారని దిగువ స్థాయి కార్యకర్తల్లో గుసగుసలు లేకపోలేదు.
బీఆర్ఎస్ పార్టీలో జరిగిన, జరుగుతున్న పరిణామాలు గమనించిన నేతలు కవిత-కేటీఆర్ మధ్య దూరం పెరిగిందని అంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్, బుధవారం కవితకు ఊహించని షాక్ ఇచ్చారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇంఛార్జ్‌గా ఉన్న ఆమెని ఆ పదవి నుంచి తప్పించారు. ఆ ప్లేసులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియమించారు.
కేటీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం కారు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లెక్కన కవితను పార్టీలో క్రమంగా పక్కన పెడుతున్నట్లు కనపిస్తోందని అంటున్నారు. జరుగుతున్న పరిణామాలను గమనించిన నేతలు, అన్నపై ఉన్న కోపంతో కవిత ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని అంటున్నారు. రాబోయే రోజుల్లో అన్నా-చెల్లి వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు..
బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే
ఆర్డినెన్స్ వద్దని బీఆర్ఎస్ నేతలు అనడం సరికాదు
న్యాయ నిపుణులతో చర్చించే ఆర్డినెన్స్ సపోర్ట్ చేస్తున్నా
తీన్మార్ మల్లన్న నాపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు… pic.twitter.com/qPaNRDhKqY
— BIG TV Breaking News (@bigtvtelugu) July 17, 2025