Big Stories

Kavitha Judicial Custody: కవిత కస్టడీ పొడిగింపు.. అది బీజేపీ కస్టడీ అంటూ కామెంట్స్!

Kavitha Judicial Custody Extended to April 23rd: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఈమె జ్యుడీషియల్ కస్టడీ‌ని న్యాయస్థానం పొడిగించింది. ఈనెల 23వరకు కస్టడీని పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. దీంతో ఆమెని తీహార్ జైలుకి తరలించారు పోలీసులు.

- Advertisement -

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో సీబీఐ అధికారులు ఆమెను సోమవారం ఉదయం పది గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. న్యాయ స్థానికి వచ్చిన సందర్భంలో మీడియాతో మాట్లాడిన కవిత, బయట బీజేపీ నేతలు ఏమి మాట్లాడుతున్నారో.. లోపల విచారణలో కూడా  సీబీఐ వాటినే ప్రశ్నలుగా మార్చి అడుగుతోందన్నారు. అది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ అని పేర్కొన్నారు. రెండేళ్లుగా అడిగిందే అడుగుతున్నారని చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. 12న న్యాయస్థానం ముందు హాజరుపరిచింది. కోర్టు ఆమెకు మూడురోజుల సీబీఐ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కస్టడీ ముగిసిన తర్వాత ఆమెని రౌస్ అవెన్యూ కోర్టులో  సోమవారం అధికారులు హాజరుపరిచారు. ఈ సమయంలో సీబీఐ తన వాదనలను వినిపించింది. విచారణకు ఆమె ఏమాత్రం సహకరించలేదని పేర్కొన్నారు.

Also Read: Black Magic : కేసీఆర్ ఇంటి సమీపంలో క్షుద్రపూజల కలకలం

ఆమెని విచారించేందుకు మరికొంత సమయం కావాలని కోరింది సీబీఐ. అందుకోసం మరో 14 రోజుల వరకు కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరింది. న్యాయస్థానం మాత్రం తొమ్మిది రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో కవితను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని న్యాయమూర్తిను సీబీఐ అధికారులు కోరారు. సీబీఐ వాదనలో న్యాయస్థానం ఏకీభవించి, ఆమెకి తీహార్ జైలుకి తరలించారు.

మరోవైపు కవిత మీడియాతో మాట్లాడడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరోసారి మాట్లాడవద్దని సున్నితంగా హెచ్చరించారు న్యాయమూర్తి. మరోవైపు బెయిల్ కోసం కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఏప్రిల్ 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణ 22న చేపట్టనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News